Site icon NTV Telugu

Rashtriya Prerna Sthal: రాష్ట్రీయ ప్రేరణ స్థల్ ప్రారంభించిన ప్రధాని మోడీ..

Modi

Modi

Rashtriya Prerna Sthal: లక్నోలో రాష్ట్రీయ ప్రేరణ స్థల్ ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్బంగా ఆయన శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహాలను ఆవిష్కరించారు. రాష్ట్రీయ ప్రేరణ స్థల్ లో శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్ పేయిల 65 అడుగుల ఎత్తైన విగ్రహాలు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ..

Top 10 ODI Run Scorers: 2025 వన్డేల్లో పరుగుల వరద పారించిన టాప్ 10 స్టార్లు వీరే!

ఇది భారత జాతీయ ప్రయాణం, నాయకత్వ వారసత్వం. మహానుభావుల వారసత్వాన్ని గౌరవించడం, సంరక్షించడంపై కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. శ్యామ ప్రసాద్, దీన్ దయాళ్ కలల సహకారానికి సంకల్పం తీసుకోవాలని.. నేతల విగ్రహాలు ఎంత ఎత్తు ఉన్నాయో.. వాటి వల్ల కలిగే ప్రేరణ అంతకంటే గొప్పదని అన్నారు. ప్రజల కృషితోనే వికసిత్ భారత్ సాకారం అవుతోందని.. ప్రేరణస్థల్.. ప్రజల ప్రతి అడుగు జాతి నిర్మాణం దిశగా ఉండాలని సందేశం ఇస్తుందని ఆయన అన్నారు.

‘కామెల్లియా సినెన్సిస్’తో తయారైనదే అసలైన ఛాయ్.. హెర్బల్ టీలు ఛాయ్ కాదు.. FSSAI స్పష్టీకరణ..!

వాజ్ పేయి, మదన్ మోహన్ మాలవ్య భారత ఏకత్వానికి కృషి చేసారని.. శ్యామ ప్రసాద్, దీన్ దయాళ్, అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహాలు గొప్ప స్ఫూర్తిని ఇస్తాయని ప్రధాని చెప్పుకొచ్చారు. అటల్ జీ హయాంలోనే గ్రామగ్రామాన రోడ్ల నిర్మాణానికి బీజం పడిందని.. 11 ఏళ్లలో భారత్ మరో అతిపెద్ద మొబైల్ ఫోన్ల ఉత్పత్తి కేంద్రంగా మారిందన్నారు ప్రధాని మోడీ.

Exit mobile version