Amrit Railway Stations: ప్రధానమంత్రి చేతుల మీదుగా దేశవ్యాప్తంగా 103 ‘అమృత్’ రైల్వే స్టేషన్ల ప్రారంభం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amrit Railway Stations: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 22 (గురువారం) నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 103 పునర్వికసిత రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. రూ.1,100 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణమైన ఈ రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ABSS) లో భాగంగా అభివృద్ధి చెంది ప్రయాణికులకు ఆధునిక వసతులతో కూడిన హబ్‌లుగా మారనున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 86 జిల్లాల్లో ఉన్న ప్రధానమైన, చిన్న రైల్వే స్టేషన్లు కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, కేరళ, చత్తీస్‌గఢ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పొండిచ్చేరిలు ఉన్నాయి.
Read also: Atchutapuram: పోలీసుల తనిఖీలు.. భారీ “సైబర్ డెన్” గుర్తింపు..!
Also Read
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
ఆంధ్రప్రదేశ్ లోని సుల్లూరుపేట రైల్వే స్టేషన్, తెలంగాణ లోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లు ఈ స్కీమ్ కింద ఆధునీకరించారు. ఈ స్టేషన్లను ప్రాంతీయ శైలిలో ఆకృతీకరించి, ఆధునిక ప్రయాణిక వసతులు, క్లీన్ టాయిలెట్లు, డిజిటల్ డిస్ప్లేలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు వంటి ఎన్నో ఆధునికతలతో తీర్చిదిద్దారు. ప్రస్తుతం రాజస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ, బికానీర్ – ముంబయి మధ్య నూతన ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. అదే విధంగా దేశ్నోక్ లోని కర్నీ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దేశ్నోక్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అభివృద్ధి కార్యక్రమం ద్వారా భారతీయ రైల్వేలు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, ఆధునిక అనుభవాన్ని అందించనున్నాయి.
Read also: Puri-Vijay : ‘బెగ్గర్’ టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి
తాజావార్తలు
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!