NTV Telugu Site icon

PM Narendra Modi: భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Modi

Modi

74th Republic Day: 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరపుకుంటున్న సందర్భంగా ఈ గణతంత్ర వేడుకలు ప్రతేకమైనది. దేశంలోని గొప్ప స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేసేందుకు కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. తోటి భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు.

కేంద్ర హోంమంత్రి గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ ఈ రోజు దేశాన్ని విముక్తి చేయడానికి, బలోపేతం చేయడానికి, రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలకు, వీర సైనికులందరికీ నేను వందనం చేస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు.

దేశరాజధాని ఢిల్లీ గణతంత్ర వేడుకలకు ముస్తాబు అయింది. కర్తవ్య మార్గ్ లో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్ కు దాదాపుగా 65,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ఇప్పటికే భద్రతా బలగాలు దేశరాజధానిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి. దాదాపుగా 6 వేల మందితో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.