NTV Telugu Site icon

Kuwait fire: తక్షణమే కువైట్ వెళ్లాలని కేంద్రమంత్రికి మోడీ ఆదేశం

Veke

Veke

కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ తక్షణ చర్యలకు సిద్ధపడ్డారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తక్షణమే కువైట్ వెళ్లాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌‌ను ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Turmeric: గోరువెచ్చని నీటిలో పసుపు వేసుకుని తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

బుధవారం ఉదయం కువైట్ సిటీలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 40 మంది భారతీయ కార్మికులు మరణించారు. మరో 40 మందికి పైగా భారతీయ కార్మికులు చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. కువైట్ సమాచారం అందగానే ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటే ఏపీలో చంద్రబాబు ప్రమాణస్వీకారం, ఒడిషాలో మోహన్ మాఝీ ప్రమాణస్వీకారానికి హాజరైన మోడీ.. హుటాహుటిన ఢిల్లీకి చేరుకుని కువైట్ ప్రమాదంపై అధికారులతో సమీక్ష జరిపారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ను కువైట్ వెళ్లాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే మృతుల్లో ఎక్కువగా కేరళ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Bengaluru: కోర్టు ఆవరణలో పాక్ నినాదాలు.. గ్యాంగ్‌స్టార్‌కు దేహశుద్ధి