ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటన కొనసాగుతోంది. మంగళవారం నార్వే పర్యటన ముగించుకుని ఇటలీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఇప్పటి వరకు నాలుగు దేశాల్లో పర్యటించగా.. చివరి పర్యటనగా రోమ్‌లో పర్యటించనున్నారు. తొలుత యూఏఈలో పర్యటించగా.. అనంతరం నెదర్లాండ్స్, స్వీడన్, నార్వేలో పర్యటించారు. చివరిగా ఇటలీ దేశానికి వెళ్లారు. రేపటితో ఐదు దేశాల పర్యటన ముగియనుంది.
ఇక రోమ్‌లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ పర్యటనతో ఆ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.
ఇక నార్వే పర్యటనలో నార్డిక్ దేశాల నాయకులతో కలిసి నిర్వహించిన సంయుక్త పత్రికా సమావేశంలో మోడీ మాట్లాడారు. భారత్-నార్వే సంబంధాలు అవకాశాలతో నిండి ఉన్నాయని… ప్రపంచంలో శాంతిని ఆకాంక్షిస్తున్నామని.. భారతదేశంతో సంబంధాలు, వాణిజ్యం, ఆవిష్కరణల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఉగ్రవాదం విషయంలో తాను రాజీపడబోనని మోడీ పేర్కొన్నారు.
#WATCH | Oslo, Norway: Prime Minister Narendra Modi departs for Rome, Italy, on the last leg of his five-nation visit.
(Video: ANI/DD) pic.twitter.com/FIWERrY14e
— ANI (@ANI) May 19, 2026
#WATCH | Prime Minister Narendra Modi to arrive in Rome, Italy, today on the last leg of his five-nation visit.
Visuals around the Colosseum, in Rome, giving a glimpse into the bustling city. pic.twitter.com/7byomlZP17
— ANI (@ANI) May 19, 2026

