Site icon NTV Telugu

Narendra Modi: టర్కీలో పెనువిషాదం..అండగా ఉంటామన్న ప్రధాని మోడీ

Pm Modi

Pm Modi

టర్కీలో వరుస భూకంపాలు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 1600కు చేరిందని సమాచారం. తాజాగా ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. “టర్కీలో భూకంపం కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. టర్కీ ప్రజలకు భారత్ అండగా. ఈ విషాదాన్ని ఎదుర్కోవడానికి అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం” అని మోడీ ట్వీట్ చేశారు. భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కూడా ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.

Also Read: Grammy Awards: 2023 గ్రామీ అవార్డ్స్ గెలుచుకుంది వీళ్లే…

భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక నగరాలు శిథిలయమ్యాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 1600 మందికిపైగా దుర్మరణం చెందగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. టర్కీలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీంతో దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో భూకంపం తీవ్ర ప్రభావం చూపించింది. 7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించిన తర్వాత గంటల వ్యవధిలో మరో 20 సార్లు శక్తిమంతమైన భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

Exit mobile version