Narendra Modi: టర్కీలో పెనువిషాదం..అండగా ఉంటామన్న ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టర్కీలో వరుస భూకంపాలు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 1600కు చేరిందని సమాచారం. తాజాగా ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. “టర్కీలో భూకంపం కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. టర్కీ ప్రజలకు భారత్ అండగా. ఈ విషాదాన్ని ఎదుర్కోవడానికి అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం” అని మోడీ ట్వీట్ చేశారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.
Also Read: Grammy Awards: 2023 గ్రామీ అవార్డ్స్ గెలుచుకుంది వీళ్లే…
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక నగరాలు శిథిలయమ్యాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 1600 మందికిపైగా దుర్మరణం చెందగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. టర్కీలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీంతో దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో భూకంపం తీవ్ర ప్రభావం చూపించింది. 7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించిన తర్వాత గంటల వ్యవధిలో మరో 20 సార్లు శక్తిమంతమైన భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
An aftershock #collapses a building in #Sanliurfa
More then 1700 building Collapse today.#deprem #Idlib #Syria #DEPREMOLDU #TurkeyEarthquake #Turkey pic.twitter.com/kRHsimvLnA— Chaudhary Parvez (@ChaudharyParvez) February 6, 2023
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?