Site icon NTV Telugu

Diwali-PM Modi: సైనికులతో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు!

Diwali Pm Modi

Diwali Pm Modi

PM Modi Celebrate Diwali 2023 with Indian Security Forces: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి కూడా దేశ సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. ఆదివారం హిమాచల్‌ ప్రదేశ్‌లోని లేప్చా సైనిక శిబిరాన్ని సందర్శించిన ప్రధాని.. సైనికులతో కలిసి అక్కడ వేడుకలు చేసుకున్నారు. ఇందుకు సంబందించిన ఫొటోలను ప్రధాని మోడీ స్వయంగా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మిలిటరీ దుస్తులు ధరించిన ప్రధాని.. సైనికులతో ముచ్చటిస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

ధైర్యవంతమైన భారత భద్రతా బలగాలతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. నేడు హిమాచల్‌ ప్రదేశ్‌కు వెళ్లడానికి ముందు ఎక్స్‌ ద్వారా దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు ప్రధాని తెలియజేశారు. ఈ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోకి ఆనందాన్ని, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.

Also Read: World Cup 2023: భారత్ ఇప్పుడు ప్రపంచకప్‌ గెలవకపోతే.. మరో 3 సార్లు ఆగాల్సిందే!

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ ప్రతి ఏటా సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. సైనికులతో ముచ్చటించి, వారికి స్వీట్లు అందించి సరదాగా గడుపుతున్నారు. 2014లో మోడీ తొలిసారి సియాచిన్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. గత ఏడాది కార్గిల్‌లో వేడుకలు చేసుకున్న ప్రధాని.. ఈసారి లేప్చాలో దీపావళి వేడుకలు చేసుకున్నారు.

Exit mobile version