Site icon NTV Telugu

PM Modi: గుడిలో సురేశ్ గోపి కూతురి వివాహం.. హాజ‌రైన ప్ర‌ధాని మోడీ!

Suresh Gopi Daughter Wedding

Suresh Gopi Daughter Wedding

ప్రముఖ నటుడు సురేశ్‌ గోపీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కూతురు భాగ్య సురేశ్‌ వివాహం శ్రేయాస్‌ మోహన్‌తో జరిగింది. వీరి వివాహం బుధవారం ఉదయం 8.45 నిమిషాల‌కు కేరళలోని గురువాయూర్‌ ఆలయంలో చాలా సింపుల్‌గా జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, కొద్దిమంది నటీనటులు మాత్రమే ఆహరజయ్యారు. సురేశ్‌ గోపీ కూతురి వివాహంకు ప్రధాన నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గురువాయూర్ శ్రీకృష్ణ ఆల‌యాన్ని ఈరోజు ప్ర‌ధాని మోడీ సంద‌ర్శించారు. కేర‌ళ సంప్ర‌దాయ దుస్తులైన ధోతి, శాలువ ధ‌రించిన మోడీ.. ముందుగా ఆల‌యంలో శ్రీకృష్ణుడి ద‌ర్శ‌నం చేసుకున్నారు. ఆ త‌ర్వాత ఆల‌య ప‌రిస‌రాల్లో నటుడు సురేశ్ గోపి కూతురు వివాహానికి హాజ‌ర‌య్యారు. నూత‌న దంపతుల్ని ఆయ‌న ఆశ్వీర్వ‌దించారు. అదే ఆలయంలో పెళ్లి చేసుకున్న మరో 30 కొత్త జంటలను కూడా ప్రధాని మోడీ ఆశీర్వదించారు.

Also Read: Hanu Man: హనుమాన్‌ స్పెషల్ స్క్రీనింగ్‌కు బాలకృష్ణ.. ప్రశాంత్‌ వర్మపై ప్రశంసలు!

సురేశ్‌ గోపీ కూతురు పెళ్లి వేడుక‌కు సినీతారలు మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్‌, దిలీప్‌, ఖుష్బూ, జయరాం తదితరులు హాజ‌ర‌య్యారు. ఇక రిసెప్షన్‌ మరో ఆడిటోరియంలో జరిగినట్లు తెలుస్తోంది. సురేశ్‌ గోపి కూతురి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Exit mobile version