NTV Telugu Site icon

Christmas 2022: క్రిస్మస్ శుభాకాంక్షలు.. ప్రధాని మోదీ సహా ప్రపంచ నాయకుల విషెస్

Pm Modi

Pm Modi

Christmas 2022: క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు వైభవంగా, ఉత్సాహంతో జరుపుకునే పండుగ. ఈ రోజు దేవుని కుమారునిగా విశ్వసించే యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు. క్రిస్మస్ పండుగను ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న జరుపుకుంటారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అర్ధరాత్రి సామూహిక ప్రార్థనలు జరిగాయి. కోవిడ్ -19 కేసులు పెరుగుతాయనే భయాల మధ్య ప్రజలు క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక దినం మన సమాజంలో సామరస్యం, ఆనంద స్ఫూర్తిని మరింతగా పెంపొందించాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రభువైన క్రీస్తు గొప్ప ఆలోచనలను, సమాజానికి సేవ చేయడంపై ఉన్న ప్రాధాన్యతను తాము గుర్తు చేసుకుంటామన్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, పోప్ ఫ్రాన్సిస్ వంటి ప్రపంచ నాయకులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమైన పర్వదినాన ప్రతి ఒక్కరూ కుటుంబం, స్నేహితులతో సమయం గడపగలరని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ అన్నారు. ప్రజలకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కుటుంబం తరఫున విషెస్‌ తెలియజేస్తున్నట్లు తెలిపారు. శాంతియుత క్రిస్మస్ ఈవ్ అని బిడెన్ ట్వీట్ చేశారు.

 

Christmas 2022: 1500 కేజీల టమాటాలతో భారీ శాంతాక్లాజ్ సైకత శిల్పం

కెనడా ప్రధాని ట్రూడో కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మిలియన్ల మంది కెనడియన్ల మాదిరిగానే తమ కుటుంబం కూడా క్రిస్మస్ చెట్టు చుట్టు గుమిగూడి వేడుకలు నిర్వహించేందుకు ఉత్సాహం ఉందన్నారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ప్రేమ, శాంతి కలగాలని కోరుకున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ మాట్లాడుతూ క్రిస్మస్ ప్రత్యేక సమయం అని అన్నారు.

 

Show comments