Site icon NTV Telugu

PM Modi: అన్నీ అత్యవరస టైమ్‌లోనే..! ఇప్పటి వరకు 11 సార్లు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని..

Pm Narendra Modi

Pm Narendra Modi

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన ప్రసంగం గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎప్పటిలాగే, ప్రధానమంత్రి ఏ అంశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. GST 2.0 సంస్కరణలు రేపు అమలు కానున్నాయి. ఈ ప్రసంగం ప్రధానంగా కొత్త జీఎస్టీపైనే ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు.. గత కొన్ని నెలలుగా భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో ప్రధాని మోడీ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. హెచ్-1బి వీసాల నుంచి సుంకాల వరకు అనేక అంశాలు చర్చనీయాంశంగా మారాయి. కాగా.. ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పదవీకాలంలో 11 సార్లు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాన సంఘటనలు, నిర్ణయాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రసంగించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

READ MORE: X Account Hack: ఎవర్రా మీరంతా.. ఏకంగా డిప్యూటీ సీఎం ఎక్స్ అకౌంట్‌నే హ్యాక్ చేశారు!

నవంబర్ 8, 2016 – నోట్ల రద్దు ప్రకటన.
మార్చి 27, 2019 – మిషన్ శక్తి (ఉపగ్రహ వ్యతిరేక క్షిపణి పరీక్ష).
మార్చి 24, 2020 – కోవిడ్-19 లాక్‌డౌన్ ప్రకటన.
ఏప్రిల్ 14, 2020 – కోవిడ్ లాక్‌డౌన్ పొడిగింపు.
మే 12, 2020 – ఆత్మనిర్భర్ భారత్ ఆర్థిక ప్యాకేజీ.
జూన్ 30, 2020 – అన్‌లాక్ 2.0 మార్గదర్శకాలు.
అక్టోబర్ 20, 2020 – కోవిడ్ సంబంధిత విధానాలు.
జూన్ 7, 2021 – టీకా డ్రైవ్ పురోగతి.
నవంబర్ 19, 2021 – మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ.
ఆగస్టు 8, 2019 – ఆర్టికల్ 370 రద్దు ప్రకటన.
మే 12, 2025 – ఆపరేషన్ సిందూర్ (ఉగ్రవాదంపై చర్యకు సంబంధించిన సమాచారం).
ఇది కాకుండా, ప్రతి ఏడాది ఆగస్టు 15న, ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

READ MORE: The last Solar Eclipse : ఈ ఏడాదిలో నేడు కనిపించనున్న చివరి సూర్య గ్రహణం..

Exit mobile version