PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఏ అంశంపై ప్రసంగిస్తారు అనే సమాచారం లేదు. అయితే.. రేపుటి నుంచి జీఎస్టీ 2.0 అమలు కానుంది. ఈ జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ సమాచారం అందించవచ్చని భావిస్తున్నారు. జీఎస్టీ 2.0లో భాగంగా.. అనేక ఉత్పత్తులపై రేట్లు తగ్గనున్నాయి. గతంలో జీఎస్టీలో నాలుగు స్లాబులు ఉండటా.. ప్రస్తుతం 5%, 18% స్లాబులకు మాత్రమే పరిమితం చేశారు. అయితే ఇందులో 12%, 28% పన్ను స్లాబ్‌లు తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 12% స్లాబ్‌లోని చాలా ఉత్పత్తులను 5% స్లాబ్‌లో ఉంచగా, 28% స్లాబ్‌లోని ఉత్పత్తులను 18% స్లాబ్‌లోకి చేర్చారు. కొన్ని నిత్యవరసర సరకులపై జీఎస్టీ రేటు సున్నాకి తగ్గించారు.
మరోవైపు.. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం అమెరికాకు నచ్చడం లేదు. భారత్‌పై అమెరికా అదనపు సుంకాల మోత మోగించింది. దీంతో అమెరికాతో భారతదేశం సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో ప్రధాని మోడీ ప్రసంగం వార్త వచ్చింది. అంతే కాకుండా.. ట్రంప్ పరిపాలన కొత్త H-1B వీసా దరఖాస్తుల వార్షిక రుసుమును US$100,000 (సుమారు రూ. 88 లక్షలు) కు పెంచింది. దీని వలన భారతీయులు, ముఖ్యంగా H-1B వీసాదారులలో ఆందోళన మొదలైంది. ఈ సుంకాలు విధించాలనే యూఎస్ నిర్ణయం, H-1B వీసాలపై భారీ రుసుము పెంపుపై ఇప్పటికే మోడీ పరోక్షంగా ప్రస్తావించారు. అందరితో మిత్రత్వం, సత్సంబంధాలు కోరుకునే, కొనసాగించే భారత్‌కు ప్రపంచంలో ప్రత్యేకంగా శత్రువంటూ ఎవరూ లేరనే చెప్పాలి. కానీ ఇతర దేశాలపై ఆధారపడటం అనే వైఖరి మనకు పెద్ద శత్రువులా తయారైంది. ఇలా మనపై పైచేయి సాధిస్తున్న పరాదీనతను మనందరం కలసికట్టుగా ఓడిద్దాం. విదేశాలపై అతిగా ఆధారపడితే అంతగా స్వదేశం విఫలమవుతుందని మోడీ గుజరాత్ ప్రసంగంలో తెలిపారు.. ఈ అంశంపై ఇప్పుడు మాట్లాడే అవకాశం ఉంది.
READ MORE: The last Solar Eclipse : ఈ ఏడాదిలో నేడు కనిపించనున్న చివరి సూర్య గ్రహణం..
