PM Kisan Update: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీ అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు! ఎంత పడతాయంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Kisan Update: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) పథకం కింద 23వ విడత కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం ద్వారా అన్నదాతలకు ఏటా లభించే రూ.6,000 పెట్టుబడి సాయాన్ని పొందాలంటే ఇప్పుడు కొత్త నిబంధనను పాటించాల్సి ఉంటుందని ముందుగానే చెప్పింది. ఇంతకీ ఆ నిబంధన ఏంటో తెలుసా.. అర్హులైన రైతులకు మాత్రమే ఈ పథకం అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘ఫార్మర్ ఐడి’ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 14 రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు మ్యాండేటరీ చేశాయి.
Also Read
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్‌లో రెండో సెంచరీ నమోదు..
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
ఈ ఫార్మర్ ఐడిని కొత్తగా దరఖాస్తు చేసుకునే వారితో పాటు, ఇప్పటికే ఈ నిధులను పొందుతున్న పాత రైతులు కూడా వీలైనంత త్వరగా తమ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. లేనిపోతే 23వ విడత రూ.2,000 నిలిచిపోయే అవకాశం ఉందని చెప్పింది. సాధారణంగా పీఎం కిసాన్ నిధులు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదలవుతాయి. ఈ ఏటా 23వ విడత నిధులు ఎప్పుడు విడుదల అవుతాయంటే.. 2026 జూన్ లేదా జూలై నాటికి రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం. గతంలో 21వ విడత 2025 నవంబర్‌లో, 22వ విడత 2026 మార్చిలో విడుదలయ్యాయి.
రైతు ఐడి అనేది ఒక ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు అని, ఇది రైతు భూమి, పంట, ఆదాయ వివరాలను ఒకే అందిస్తుందని అధికారులు చెబుతున్నారు. రైతులు తమ రాష్ట్ర వ్యవసాయ పోర్టల్ లేదా ‘అగ్రిస్టాక్’ (AgriStack) ప్లాట్‌ఫారమ్ ఓపెన్ చేసుకొని ఆన్‌లైన్‌లో ఈ ఫార్మర్ ఐడీని దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. దీనికి ఆధార్ కార్డు, దానికి లింక్ అయిన మొబైల్ నంబర్, భూమి పత్రాలు అవసరం అవుతాయని చెప్పారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఇ-కేవైసి (e-KYC) పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పీఎం కీసాన్ డబ్బులు విడుదలలో లేదా రిజిస్ట్రేషన్‌లో ఏవైనా ఇబ్బందులు ఉంటే రైతులు 155261 లేదా 1800115526 హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేయవచ్చన్నారు. లేకపోతే pmkisan-ict@gov.in ఈ ఇమెయిల్‌కు సమస్యకు తెలియజేవచ్చని అన్నారు. అలాగే అన్నదాతలు వారి ఇబ్బందులను 011-23381092 ఈ ఫోన్ నంబర్‌కి ఫోన్ చేసి కూడా తెలియజేవచ్చన్నారు.
READ ALSO: Nayan Sarika: ‘రాకాసా’తో మరో హిట్ ఖాతాలో వేసుకున్న క్రేజీ బ్యూటీ..
తాజావార్తలు
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
-
Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
-
UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
-
Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్‌లో రెండో సెంచరీ నమోదు..
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!