Insurance Price: తగ్గనున్న ఇన్సురెన్స్ ప్రీమియం ధరలు.. మోటార్, హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్‌లు ఇక తక్కువ ధరలోనే..
- తగ్గనున్న ఇన్సురెన్స్ ప్రీమియం ధరలు..
- జూన్ నుంచే అమల్లోకే..
- ఇక అన్నీ ఒకే ప్లాట్ ఫాం మీదకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో బీమా (Insurance) కొనుగోలు ప్రక్రియ త్వరలోనే చౌకగా మారబోతోంది. 2026 జూన్ నెల నుండి ‘బీమా సుగమ్’ (Bima Sugam) అనే కొత్త ప్లాట్‌ఫారమ్ అందుబాటులోకి రానుంది. ఈ వేదిక ద్వారా ఎటువంటి ఏజెంట్ కమీషన్లు లేని ‘స్టాండర్డ్ ఇన్సూరెన్స్’ పాలసీలు లభిస్తాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీనివల్ల సామాన్యులకు కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. పాలసీల ధరలు (ప్రీమియంలు) గణనీయంగా తగ్గుతాయి.
అసలు ఏం మారుతుంది..?
Also Read
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
సాధారణంగా మనం ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకుంటే, అందులో ఏజెంట్లకు ఇచ్చే కమీషన్ కూడా కలిసి ఉంటుంది. కానీ బీమా సుగమ్ వేదికపై ఈ కమీషన్లు ఉండవు. ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం 5 నుంచి 7 శాతం వరకు ప్లాట్‌ఫారమ్ ఫీజు మాత్రమే చెల్లిస్తాయి. మధ్యవర్తులు లేకపోవడం వల్ల ఆ మిగిలిన డబ్బు వినియోగదారులకు లాభంగా మారుతుంది. అంటే తక్కువ ధరకే పాలసీలు దొరుకుతాయి. అంతేకాకుండా, ఈ పాలసీలు చాలా సులభంగా అర్థమయ్యేలా ఉంటాయి. క్లిష్టమైన నియమ నిబంధనలు లేకుండా, సాదాసీదాగా ఉండటం వల్ల ప్రజలు సులభంగా పోల్చి చూసుకుని తమకు నచ్చినది ఎంచుకోవచ్చు.
Also Read:Village Volunteer: ‘ప్రతీ గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమిస్తాం’: మంత్రి తుమ్మల
ఎప్పుడు ఏవి అందుబాటులోకి వస్తాయి..?
ఈ కొత్త విధానం ఒకేసారి కాకుండా దశలవారీగా అమలులోకి వస్తుంది. జూన్ 2026లో మొదటగా కొత్త వాహనాల కోసం మోటార్ ఇన్సూరెన్స్ ప్రారంభం కావచ్చు. ఆగస్టు 2026లో పాత వాహనాల ఇన్సూరెన్స్ పునరుద్ధరణ (Renewal) మరియు ఆరోగ్య బీమా (Health Insurance) పాలసీలు అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబర్ 2026లో.. జీవిత బీమాకు సంబంధించిన ‘టర్మ్ ఇన్సూరెన్స్’ ప్లాన్‌లు మొదలవుతాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే.. బీమా సుగమ్ అనేది ఒకే ఒక వేదిక. ఇక్కడ మీరు పాలసీలు కొనవచ్చు, పాతవి రిన్యూవల్ చేసుకోవచ్చు మరియు క్లెయిమ్ (డబ్బులు వెనక్కి తీసుకోవడం) కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మధ్యవర్తుల గొడవ లేకుండా నేరుగా పారదర్శకంగా పనులు జరుగుతాయి. ఇది అమల్లోకి వస్తే భారతదేశంలో ఇన్సూరెన్స్ రంగం పూర్తిస్థాయిలో సామాన్యులకు చేరువవుతుంది.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!