Site icon NTV Telugu

PM Kisan Update: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీ అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు! ఎంత పడతాయంటే..

Pm Kisan

Pm Kisan

PM Kisan Update: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) పథకం కింద 23వ విడత కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం ద్వారా అన్నదాతలకు ఏటా లభించే రూ.6,000 పెట్టుబడి సాయాన్ని పొందాలంటే ఇప్పుడు కొత్త నిబంధనను పాటించాల్సి ఉంటుందని ముందుగానే చెప్పింది. ఇంతకీ ఆ నిబంధన ఏంటో తెలుసా.. అర్హులైన రైతులకు మాత్రమే ఈ పథకం అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘ఫార్మర్ ఐడి’ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 14 రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు మ్యాండేటరీ చేశాయి.

READ ALSO: Insurance Price: తగ్గనున్న ఇన్సురెన్స్ ప్రీమియం ధరలు.. మోటార్, హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్‌లు ఇక తక్కువ ధరలోనే..

ఈ ఫార్మర్ ఐడిని కొత్తగా దరఖాస్తు చేసుకునే వారితో పాటు, ఇప్పటికే ఈ నిధులను పొందుతున్న పాత రైతులు కూడా వీలైనంత త్వరగా తమ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. లేనిపోతే 23వ విడత రూ.2,000 నిలిచిపోయే అవకాశం ఉందని చెప్పింది. సాధారణంగా పీఎం కిసాన్ నిధులు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదలవుతాయి. ఈ ఏటా 23వ విడత నిధులు ఎప్పుడు విడుదల అవుతాయంటే.. 2026 జూన్ లేదా జూలై నాటికి రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం. గతంలో 21వ విడత 2025 నవంబర్‌లో, 22వ విడత 2026 మార్చిలో విడుదలయ్యాయి.

రైతు ఐడి అనేది ఒక ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు అని, ఇది రైతు భూమి, పంట, ఆదాయ వివరాలను ఒకే అందిస్తుందని అధికారులు చెబుతున్నారు. రైతులు తమ రాష్ట్ర వ్యవసాయ పోర్టల్ లేదా ‘అగ్రిస్టాక్’ (AgriStack) ప్లాట్‌ఫారమ్ ఓపెన్ చేసుకొని ఆన్‌లైన్‌లో ఈ ఫార్మర్ ఐడీని దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. దీనికి ఆధార్ కార్డు, దానికి లింక్ అయిన మొబైల్ నంబర్, భూమి పత్రాలు అవసరం అవుతాయని చెప్పారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఇ-కేవైసి (e-KYC) పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పీఎం కీసాన్ డబ్బులు విడుదలలో లేదా రిజిస్ట్రేషన్‌లో ఏవైనా ఇబ్బందులు ఉంటే రైతులు 155261 లేదా 1800115526 హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేయవచ్చన్నారు. లేకపోతే pmkisan-ict@gov.in ఈ ఇమెయిల్‌కు సమస్యకు తెలియజేవచ్చని అన్నారు. అలాగే అన్నదాతలు వారి ఇబ్బందులను 011-23381092 ఈ ఫోన్ నంబర్‌కి ఫోన్ చేసి కూడా తెలియజేవచ్చన్నారు.

READ ALSO: Nayan Sarika: ‘రాకాసా’తో మరో హిట్ ఖాతాలో వేసుకున్న క్రేజీ బ్యూటీ..

Exit mobile version