కష్టపడి పైసా పైసా కూడబెట్టుకొని సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ప్లాట్ల కోసం లక్షల్లో డబ్బులు చెల్లించి మోసపోయిన తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సాహితీ ఇన్‌ఫ్రాటెక్ బాధితులు వేడుకున్నారు. ఏండ్లు గడుస్తున్నా..నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఇప్పుడు రోడ్డునపడ్డాం అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ కేసు రేరా ( తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ) లో విచారణ జరుగుతుండటంతో… బాధితులు ఏసీ గార్డ్స్ లోని రేరా కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. సుమారు 2000 మంది సభ్యులు 1500 కోట్ల వరకు డబ్బు కట్టినట్లు తెలిపారు.
Pakistan: చుక్కల్ని అంటుతున్న పెట్రోల్ ధరలు.. లీటర్ రూ. 290
ఇదే విషయమై గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులను కలిసి మోర పెట్టుకున్న తమకు న్యాయం జరగలేదన్నారు. అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ స్కామ్ లో భాగస్వామ్యం ఉందని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయని బిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం జరిగిందని వారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిన తమకు న్యాయం చేయాలని వారు కోరారు. సంస్థ పేరు మీద ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని , వారే నిర్మాణాలు చేపట్టి తమకు ఇండ్లు కట్టించాలని విజ్ఞప్తి చేశారు.
Nani 33: దసరా డైరెక్టర్‌తో మరో సినిమా అనౌన్స్ చేసిన నాని.. అదొక్కటే నిరాశ!
