Site icon NTV Telugu

IPL2023 : సీఎస్కేకు షాక్.. ఆల్ రౌండర్ ఐపీఎల్ నుంచి ఔట్!

Kail Jemison

Kail Jemison

ఐపీఎల్ ఆరంభానికి ముందే ఫారిన్ ప్లేయర్స్ ఒక్కొక్కొరుగా జట్లకు దూరమవుతూ ఫ్రాంఛైజీలకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలు టీమ్స్ కు సంబంధించి కీలక ఆటగాళ్లు ఆయా జట్లకు దూరమయ్యారు. తాజాగా గాయంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ కైల్ జేమీసన్ ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. జేమీసన్ స్థానంలో సౌతాఫిక్రా పేసర్ సిసాండ మగళను జట్టులోకి తీసుకుంటున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ ప్రకటించింది. న్యూజిలాండ్ కు చెందిన ఆల్ రౌండర్ జేమీసన్ ఐపీఎల్ 2021 సీజన్ మాత్రమే ఆడాడు. ఆ సీజన్ వేలంలో అతడిని రూ. 15 కోట్లకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కొనుగోలు చేసింది. ఆ ఏడాది అతడు అధిక ధర పలికిన ఫారిన్ ప్లేయర్ గా జేమీసన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. కానీ తనపై బెంగళూరు పెట్టుకున్న అంచనాల్ని పూర్తిగా వమ్ముచేశాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ విఫలమయ్యాడు. తొమ్మిది మ్యాచ్ ల్లో తమ్మిది వికెట్లు మాత్రమే తీశాడు. బ్యాటింగ్ లోనూ 65 రన్న్ మాత్రమే చేయడంతో అతడిని బెంగళూరు వదులుకుంది.

Also Read : AP Assembly: పోడియం దగ్గర వస్తే ఆటోమేటిక్‌గా సస్పెన్షన్‌.. స్పీకర్‌ రూలింగ్‌

ఐపీఎల్ 2023 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జేమీసన్ కోటి రూపాయల కనీస ధరకు కొనుగోలు చేసింది. కానీ గాయంతో ఈ సీజన్ మొత్తానికి జేమీసన్ దూరమయ్యాడు. వెన్నుగాయంతో అతడు బాధపడుతున్నట్లు సమచారం. ఇందుకోసం సర్జరీ చేసుకోనున్నట్లు తెలిసింది. సర్జరీ కారణంగా నాలుగు నెలల పాటు జేమీసన్ క్రికెట్ కు పూర్తిగా దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ఐపీఎల్ 2023 సీజన్ లో అతడు ఆడటం లేదు.

Also Read : Amritpal Singh: పాకిస్తాన్ ఐఎస్ఐతో లింకులు.. జార్జియాలో శిక్షణ.. ఖలిస్తానీ నేత గురించి విస్తూపోయే విషయాలు

మరోవైపు మగళను రూ. 50లక్షల కనీస ధరకు సీఎస్కే సొంతం చేసుకుంది. మగళకు దేశవాళీ టీ20 క్రికెట్ లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటి వరకు 124టీ20లు ఆడిన మగళ.. 136 వికెట్స్ తీశాడు. అదే విధంగా తొలి దక్షిణాఫ్రికా టీ20లీగ్ లో సన్ రైజర్స్ ఈసర్న్ కేప్ తరుపున ఆడిన మగళ.. 12 మ్యాచ్ ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. అతడు దక్షిణాఫ్రికా తరపున ఇప్పటి వరకు కేవలం 4టీ20లు మాత్రమే ఆడాడు. ఇక ఐపీఎల్ 16వ సీజన్ మార్చ్ 31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే అన్ని జట్లకు లీగ్ ప్రారంభానికి ముందే భారీ షాక్లు తగులుతున్నాయి. గాయల కారణంగా పలువురు ఆటగాళ్లు లీగ్ కు దూరమవుతున్నారు. సీజన్ మొదలయ్యేందుకు టైమ్ కూడా దగ్గర పడుతుండటంతో గాయపడిన ప్లేయర్ల జాబితా పెరుగుతూ వస్తోంది. అయితే ఈ సీజన్ కు దూరమవ్వనున్న ఆటగాళ్లకు ఫ్రాంఛైజీలు మొత్తం సొమ్మును చెల్లిస్తాయా? లేక సగమే ఇస్తాయా? సీజన్ కు ముందు ఆయా ఫ్రాంఛైజీలు ఎంత మేరకు నష్టపోనున్నాయి? అనేది చూడాలి..

Exit mobile version