Site icon NTV Telugu

Planes Collide: తృటిలో పెను ప్రమాదం మిస్.. ఢీకొన్న రెండు విమానాలు

Aeroplane Crash

Aeroplane Crash

Planes Collide: న్యూయార్క్‌లోని లా గార్డియా విమానాశ్రయంలో రెండు డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాలు రన్‌వేపై ఢీకొన్నాయి. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు విమానాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ ఢీకొన్న ఘటనలో ఒక విమానం రెక్క ఊడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒకరికి గాయాలైనట్లు సమాచారం అందుతోంది. ఒక డెల్టా విమానంలో ప్రయాణించిన వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం, విమానాలు ల్యాండింగ్ అయిన తర్వాత గేట్ వైపు నెమ్మదిగా వెళ్తున్నప్పుడు మరొక డెల్టా విమానం వచ్చి ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత ఒక విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version