Site icon NTV Telugu

Plane Crash: హాంకాంగ్‌లో కూలిన విమానం.. ఇద్దరు మృతి.!

Plane Crash

Plane Crash

Plane Crash: హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ఒక కార్గో విమానం రన్‌వే నుంచి జారిపడి సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విమానాశ్రయ గ్రౌండ్ సిబ్బంది మృతి చెందగా, విమానంలో ఉన్న నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. స్థానిక మీడియా ప్రకారం ఈ విమానం టర్కీకి చెందిన ఎయిర్ ACT ఎయిర్‌లైన్‌ది కాగా.. ఎమిరేట్స్ EK9788 అనే ఫ్లైట్ నంబర్‌తో దుబాయ్‌ నుంచి వచ్చింది. బోయింగ్ 747-481 మోడల్‌కి చెందిన ఈ కార్గో విమానం స్థానిక సమయం ప్రకారం ఉదయం 3:50 గంటలకు ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై ఉన్న ఒక వాహనాన్ని ఢీకొని సముద్రంలోకి జారిపోయింది.

World Cup 2025: మ్యాచ్ ఓడినా.. భారత్ కు సెమీఫైనల్‌కు ఛాన్స్.. ఎలాగంటే?

ఈ ఘటనపై సివిల్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్ తెలిపిన ప్రకారం.. రన్‌వేపై పనిచేస్తున్న ఇద్దరు గ్రౌండ్ సిబ్బంది సముద్రంలో పడి గాయపడ్డారు. వారిని రక్షించి ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే విమాన సిబ్బంది నలుగురు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన రన్‌వేను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అయితే విమానాశ్రయంలోని మిగతా రెండు రన్‌వేలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

Team India loss: అటు మెన్స్.. ఇటు ఉమెన్స్.. ఒకేరోజు రెండు ఓటములు..!

హాంకాంగ్ ప్రభుత్వం రక్షణ చర్యల కోసం హెలికాప్టర్లు, అగ్నిమాపక నౌకలను పంపినట్లు సమాచారం. ప్రమాదం తర్వాత కనీసం 11 కార్గో విమానాల రాకపోకలను రద్దు చేశారు. భద్రతా పరంగా అత్యుత్తమ రికార్డ్ కలిగిన హాంకాంగ్ విమానాశ్రయంలో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. అయితే ఎమిరేట్స్ సంస్థ ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

Exit mobile version