NTV Telugu Site icon

Plane Crash: పార్టీ చేసుకుంటుండగా కుప్పకూలిన విమానం.. వైరల్ వీడియో

Party

Party

Plane Crash in Gender Reveal Party : ఇటీవల కాలంలో చాలా మంది హంగు ఆర్భాటాలతో పార్టీలు చేసుకుంటున్నారు. ప్రతి చిన్న విషయానికి ఫంక్షన్ ఏర్పాటు చేసి బంధు, మిత్రులతో గడపాలనుకుంటున్నారు. అందుకోసం డిఫరెంట్ గా ఆలోచించి పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు ఇలా ప్రతి చిన్న దానికి కూడా పార్టీలు చేసుకుంటున్నారు. కామన్ గా మన సంప్రదాయం ప్రకారం కడుపుతున్న సమయంలో కేవలం శీమంతం అనే ఫంక్షన్ మాత్రమే చేసేవారు. అయితే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచే రకరకాల పార్టీలు చేస్తున్నారు. బేబీ జెండర్ రివీల్ కి ఒక పార్టీ, శీమంతంకి ఓ పార్టీ, ఫోటో షూట్స్ ఇలా ప్రతిది సంబరమే. అయితే మన దేశంలో కడుపులో పిండం ఆడ, మగ అన్నది ముందే చెబితే అది నేరం. అయితే విదేశాల్లో మాత్రం అలాంటి చట్టాలు లేవు. దీంతో వారు ముందుగానే తమకు పుట్టబోయేది ఆడ పిల్ల, మగ పిల్లాడా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు.

Also Read: Cow Attacks Old man: పగబట్టినట్టు వృద్ధుడిపై దాడి చేసి చంపేసిన ఆవు.. వీడియో వైరల్

అయితే ఈ విషయాన్ని సాధారణంగా తమ సన్నిహితులతో పంచుకోవడానికి ప్రెగ్నెన్సీ వచ్చాక 20 వారాలకు ఇలాంటి పార్టీ చేస్తారు. అందులో తమ పుట్టబోయే బిడ్డ విషయాన్ని బంధు మిత్రులకు వెల్లడిస్తారు. అయితే దీనిని ఈ మధ్య చాలా మంది గ్రాండ్ గా చేసుకుంటున్నారు. అలాగే మెక్సికోలోని శాన్ పెడ్రోలో ఓ జంట జెండర్ రివీల్ ఫంక్షన్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటికి కొంతమంది అతిధులు హాజరయ్యారు. పార్టీని గ్రాండ్ గా చేయాలనే ఉద్దేశ్యంతో ఆ జంట ఓ విమానాన్ని ఏర్పాటు చేసి పై నుంచి రంగులు వేయించింది. అయితే అన్యూహ్యంగా రంగులు వేసిన తరువాత ఆ విమానం కుప్పకూలిపోయింది. స్టంట్ వీడియో కూలిపోవడంతో దానిలో ఉన్న పైలెట్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్టు వైద్యలు నిర్ధారించారు. దీంతో హ్యాపీగా చేసుకుంటున్న పార్టీ విషాదంగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇలా ప్రతి దానికి పార్టీలు చేసుకోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అంటూ మండిపడుతున్నారు.

 

Show comments