NTV Telugu Site icon

Piyush Goyal: మేము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం

Goyal

Goyal

రాజేంద్రనగర్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఉప్పర్ పల్లి లోని ఓ హోటల్ లో పారిశ్రామిక వేతలతో సమావేశం అయ్యారు. సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. భారత దేశ వ్యాప్తంగా బీజేపీ పార్టీ చేసిన అభివృద్ధిని మంత్రి వివరించారు. తెలంగాణలో ఒక్కసారిగా అవకాశం కల్పించాలని ఆయన కోరారు. కేసీఆర్ కుటుంబ పాలనకు సమయం ముగిసింది.. తెలంగాణ ప్రజలు ఆ పార్టీనీ ఓడించ బోతున్నారు.. కేసీఆర్ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డాడు అంటూ పీయుష్ గోయల్ విమర్శలు గుప్పించారు.

Read Also: Devi Sri Prasad : ఆ సాంగ్ కేవలం నాలుగున్నర నిముషాల్లోనే చేశాను..

ప్రాజెక్ట్ లలో అవినీతి చేశారు.. నాణ్యత లేకుండా నిర్మించారు అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోమల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సంతుస్టికరణ రాజకీయాలను చేస్తున్నాయి.. తెలంగాణలో బీజేపీ యేతర ప్రభుత్వం ఉన్న మోడీ రాష్ట్ర అభివృద్ధికి సహకరించారు.. మోడీ హయాంలో విదేశీ మారకం విలువ రికార్డ్ స్థాయిలో పెరిగింది అని ఆయన తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది.. మేము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని పేర్కొన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై ఓవైసీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలీదు.. తెలంగాణ సమాజం ఆయన మాటలు నమ్మే పరిస్తితిలో లేదు.. బీజేపీ అధికారంలోకి వచ్చాక రైలు ప్రమాదాలు తగ్గాయి.. ప్రయాణ సమయం తగ్గింది.. రైల్వేలు మరింత విస్తరిస్తాము.. ఫార్మ్ హౌస్ లో ఉండి కేసిఆర్ పరిపాలన చేసారు.. ఆయన్ని ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.