Devi Sri Prasad : ఆ సాంగ్ కేవలం నాలుగున్నర నిముషాల్లోనే చేశాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మ్యూజిక్ తో ప్రేక్షకులతో డాన్స్ చేయిస్తాడు.. ఆయన మ్యూజిక్ అందించిన సాంగ్స్ అంటే ప్రేక్షకులలో పిచ్చ క్రేజ్ వుంది..దేవిశ్రీ అందించిన మ్యూజిక్ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది.దేవీ శ్రీ ప్రసాద్ ఇటీవలే జాతీయ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ గా దేవీ శ్రీ ప్రసాద్ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. పుష్ప సినిమాకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో అద్భుతమైన నటనకు గాను అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ గా అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే దేవీకి కూడా అవార్డు రావడం విశేషం.. పుష్ప సినిమాలో సాంగ్స్ అన్ని కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.
ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి పుష్ప సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు దేవీ శ్రీ.ముఖ్యంగా ఈ సినిమాలో లో ఉ అంటావా మామ.. సాంగ్ అలాగే శ్రీ వల్లి సాంగ్స్ ఎంతగానో పాపులర్ అయ్యాయి. శ్రీవల్లి సాంగ్ లో హుక్ స్టెప్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరు ఈ స్టెప్ వేసి సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేశారు.తాజాగా దేవీ శ్రీ ప్రసాద్ పుష్ప సాంగ్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పుష్ప సినిమాలో శ్రీ వల్లీ సాంగ్ చేయడానికి తనకు కేవలం నాలుగు నిమషాలా ముపై సెకండ్స్ మాత్రమే సమయం పట్టిందని ఆయన తెలిపారు. ఈ సాంగ్ కు ముందుగా తన గిటార్ తో ఓ హమ్మింగ్ అనుకున్నాని ఆ తర్వాత ఈ సినిమా లో హీరోయిన్ పేరు శ్రీవల్లీ కావడంతో ఆ పేరును ఇంక్లూడ్ చేస్తూ పాడాను అని ఆయన తెలిపారు.శ్రీవల్లి సాంగ్ ఎంతగానో పాపులర్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది అని దేవిశ్రీ తెలిపారు.
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!