టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు వింటేనే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు మొదలవుతాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘అనిమల్’ సినిమాలతో తనదైన రా అండ్ రస్టిక్ మేకింగ్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆయన, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటంటే..
Also Read : Adivi Sesh : పీఆర్ ట్యాగ్‌లకు నో చెప్పిన అడివి శేష్..
తాజాగా, ఈ సినిమా కూడా బాహుబలి, కేజీఎఫ్ తరహాలోనే రెండు భాగాలుగా రాబోతుందనే వార్త ఫిల్మ్ నగర్‌లో షేక్ చేస్తోంది. ఈ వార్తల ప్రకారం.. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్ పార్ట్ 1’ మరియు ‘పార్ట్ 2’ కోసం ఇప్పటికే కథను సిద్ధం చేశారని, ప్రభాస్ నుంచి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. ప్రభాస్ నుంచి ఏకధాటిగా 100 రోజుల కాల్‌షీట్లు అడగడం, భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల ప్లానింగ్ చూస్తుంటే ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. పార్ట్ 1 రిలీజ్ అయ్యాక చిన్న గ్యాప్‌తో పార్ట్ 2ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది వంగా ప్లాన్ అట. ఒకవేళ అదే నిజమైతే, ప్రభాస్ మాస్ ఇమేజ్ మరియు సందీప్ ఇంటెన్సిటీ తోడై ఇండియన్ సినిమా చరిత్రలో ‘స్పిరిట్’ మరో మైలురాయిగా నిలవడం ఖాయం.
