Site icon NTV Telugu

MLA Pinnelli: ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి మరో పిటిషన్

Pinneli

Pinneli

Pinnelli Ramakrishna Reddy: ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సందర్భంగా తనపై నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఐజీ సహా కొందరు పోలీస్ అధికారులు తమను టార్గెట్ చేసి ఏకపక్షంగా వ్యవహరించారని పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా, మాచర్లలో అల్లర్ల తర్వాత వైసీపీ క్యాడర్ పైనే కేసులు పెట్టారు తప్ప మా ఫిర్యాదులు పట్టించుకోవటం లేదని పిన్నెల్లి పిటిషన్ లో ప్రస్తావించారు.

Read Also: Virat Kohli: నిజం చెబుతున్నా.. ఆ రోజు చాలా భయపడ్డా: కోహ్లీ

ఇక, ఈ నెల 13, 14 తేదీల్లో అల్లర్లు జరిగితే 23వ తేదీన బెయిల్ వచ్చాక దొంగ రికార్డులతో కోర్టులో పోలీసులు దొరికారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ లో తెలిపారు. సదరు అధికారులపై చర్యలు తీసుకుని విచారణ అధికారులుగా వేరే వారిని నియమించాలని ఆయన కోరారు. విచారణకు అనుమతించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు.. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత విచారణ చేయనున్నట్లు పేర్కొనింది. కాగా, మాచర్లలో జరిగిన అల్లర్లపై ఇప్పటికే ఏపీ హైకోర్టు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మూడు కేసుల్లో బెయిల్ ను మంజూరు చేసింది.

Exit mobile version