Pindam:లోక్‌నాథ్ గా అవసరాల శ్రీనివాస్.. ఫస్ట్ లుక్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ నటుడు శ్రీరామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పిండం’. ఈ సినిమాలో కుశీ రవి హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ చిత్రానికి సాయికిరణ్ దైదా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సాయికిరణ్ ఈ మూవీ తోనే దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.కళాహి మీడియా పతాకం పై యశ్వంత్ దగ్గుమాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ ను కూడా విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..ఈ సినిమాను డిసెంబర్ 15 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు.టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.అయితే తాజాగా ఈ మూవీ నుంచి అవసరాల శ్రీనివాస్ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ ‘లోక్‌నాథ్’ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ అవసరాల శ్రీనివాస్ సోఫాలో కూర్చొని ఎవరినో చూస్తున్నట్లు వుంది.. ఇక సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సినిమాలో శ్రీరామ్‌తో పాటు, ఈశ్వరీరావు, రవివర్మ, మాణిక్ రెడ్డి, బేబీ చైత్ర, బేబీ ఈషా, విజయలక్ష్మి మరియు శ్రీలత వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు.ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ మారుమూల పల్లెటురిలో ఇల్లు, అందులో ఓ కుటుంబం, వాళ్లను భయపెట్టే ఒక ఆత్మ.. దీని చుట్టే కథ కథ సాగనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఆత్మలను బంధించే మంత్రగత్తె పాత్రలో ఈశ్వరి రావు నటించారు..తన కుటుంబాన్ని ఆత్మ నుంచి రక్షించుకునే పాత్రలో శ్రీరామ్ కనిపించనున్నాడు.ఈ చిత్రం 1930 నుంచి 1990 వరకు మూడు టైమ్ లైన్‌లలో ఈ సినిమా ఉండబోతున్నట్లు దర్శకుడు సాయికిరణ్ దైదా తెలిపారు.. పిండం మూవీ ని సాంగ్స్,కామెడీ అలాంటివి ఏమి లేకుండా మిమ్మల్ని భయపెట్టడం కోసం తీసిన స్ట్రయిట్ హారర్ ఫిల్మ్ అని థియేటర్లలో చూసే ప్రతి ప్రేక్షకుడికి ఖచ్చితంగా ఓ కొత్త అనుభూతిని ఇస్తుందని డైరెక్టర్ సాయికిరణ్ దైదా తెలిపారు.
Also Read
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
తాజావార్తలు
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!