NTV Telugu Site icon

Homemade Pimples Face Packs: మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?.. ఈ ఫేస్ ప్యాక్‌ని అప్లై చేస్తే అందమైన ముఖం మీ సొంతం!

Pimples

Pimples

Here is Best Pimples Face Packs Homemade: ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది. ఈ సీజన్‌లో పడే వర్షాలు శరీరానికి, మనస్సుకు ఉపశమనం కలిగిస్తాయి. అయితే వర్షాకాలంలో మీరు పలు చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో తేమ పెరుగుతుంది. దీని కారణంగా చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు మొదలవుతాయి. దాంతో ముఖం మీద మొటిమలు కూడా వస్తాయి. మొటిమలు ముఖం యొక్క అందాన్ని ప్రభావితం చేయడమే కాకుండా.. చర్మాన్ని కూడా పాడు చేస్తాయి. మొటిమల వలన ముఖ్యంగా టీనేజ్ వయసులో ఉన్న వారు బాగా ఇబ్బందిపడతారు.

టీనేజ్ వయసులో ఉన్న వారు మొటిమలను వదిలించుకోవడానికి ఎన్నో రకాల క్రిములు వాడుతుంటారు. అయినా కూడా మొటిమల సమస్య వారిని వేధిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. సహజ పదార్థాలతో చేసిన ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించడం వలన ఈజీగా మొటిమల సమస్య నుంచి బయటపడొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మొటిమల సమస్య నుంచి బయటపడడానికి మీరు ఏ ప్యాక్ (Homemade Face Packs For Pimples) ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం.

Also Read: Monsoon Health Tips: వేడి నీటిలో వీటిని కలుపుకుని తాగితే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది!

తేనె, దాల్చిన చెక్క ఫేస్ ప్యాక్ (Pimples Face Pack with Honey and Cinnamon):
మొటిమలసమస్య నుంచి బయటపడడానికి తేనె మరియు దాల్చిన చెక్కతో కూడిన ఫేస్ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేయవచ్చు. ఈ రెండింటిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. ఇందుకోసం ఒక గిన్నెలో ఒక చెంచా తేనెను తీసుకుని.. దానికి ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని కలపండి. రెండింటినీ బాగా మిక్స్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.

అలోవెరా, ముల్తానీ మట్టి (Pimples Face Pack with Multani Mitti and Aloe Vera):
వర్షాకాలంలో మొటిమలు వచ్చినట్లయితే అసలు విస్మరించవద్దు. కలబంద మరియు ముల్తానీ మట్టితో చేసిన ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేయాలి. ఇందుకోసం ఒక గిన్నెలో 2 టీస్పూన్ల అలోవెరా జెల్ తీసుకోండి. అందులో ముల్తానీ మట్టి మరియు కొద్దిగా నీరు వేసి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు.

Also Read: Peach Health Benefits: ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించే ఫ్రూట్ ఇదే.. ఈరోజే ఆహారంలో చేర్చుకోండి!

Show comments