NTV Telugu Site icon

Hassan Nasrallah: హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టిన పైలెట్ కు ఘన స్వాగతం!(వీడియో)

Viral

Viral

Hassan Nasrallah: ఇజ్రాయెల్ భూభాగంపై ఇటీవల తీవ్రవాద సంస్థ హమాస్ చేసిన దాడితో మంటలు చెలరేగుతున్నాయి. ఉగ్రవాద నాయకులు ఎక్కడ దాక్కున్నా వారి వెంట పడుతున్నారు. ఎప్పుడూ సవాలు విసురుతున్న హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థ నాయకుడు సయ్యద్ హసన్ నస్రల్లాను కూడా హత మార్చింది. లెబనాన్ దేశ రాజధాని బీరుట్‌ లో ఓ ప్రాంతంలో 60 అడుగుల లోతైన బంకర్‌లో దాక్కున్న నస్రల్లా పై చాలా ఖచ్చితమైన దాడులతో చంపబడ్డాడు. నస్రల్లాను చంపడానికి ఇజ్రాయెల్ టన్నుల బరువు ఉన్న బంకర్ బాంబులను ఉపయోగించింది.

Also Read: America – Syria: సిరియాపై అమెరికా వైమానిక దాడి.. 37 మంది అల్ ఖైదా ఉగ్రవాదులు హతం!

కాగా, ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి నస్రల్లాను హతమార్చిన ఇజ్రాయెల్ పైలట్‌కు ఎయిర్‌బేస్ వద్ద అతడికి అపూర్వ స్వాగతం లభించింది. అతని సహచరులు పాటలు, నృత్యాలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇజ్రాయిలీలు నస్రల్లాను క్రమబద్ధీకరించడం ఎంత ముఖ్యమో… సైనికుల వేడుకలు చూస్తే యిట్టె అర్థమవుతుంది. దీనికి సంబంధించిన వీడియో ప్యాస్తుతం సోషల్ మీడియాలలో వైరల్‌గా మారింది.

Show comments