Site icon NTV Telugu

Viral Video: ఇదేందయ్యా ఇది.. సైకిల్ పంప్‌తో విమానం టైరుకు గాలి నింపడం ఏంటయ్యా!

Viral

Viral

Viral Video: ప్రస్తుత రోజుల్లో సోష‌ల్ మీడియా ప్రతిఒక్కరికి అందుబాటులో ఉండడంతో ప్రతి నిత్యం ర‌క‌ర‌కాల వీడియోలు వైర‌ల్ అవుతూ ఉండడం చూస్తూనే ఉంటాము. ప్రపంచంలో ఏ మూల‌న ఏం విషయం జ‌రిగినా, అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు క్ష‌ణాల్లో మన ముందు ప్రత్యక్షమవుతున్నాయి. ఇందులో కొన్ని సరికొత్త, ఆస‌క్తిక‌ర అంశాలు ఎక్కువగా వైర‌లయ్యి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయి. ఈ కోవలోకే తాజాగా ఓ వైరల్ వీడియో కూడా చేరింది. మరి ఆ వీడియో ఏంటి? అసలేమీ జరిగిందన్న విషయాన్ని చూసినట్లతే..

నిజానికి విమాన ప్రయాణం చాలా ఖ‌ర్చుతో కూడుకున్న విషయమన్న సంగతి తెలిసిందే. ఇకపోతే, విమానం ప్రయాణానికి ముందు అందులోని అన్ని భాగాలు సరిగ్గా పని చేసేలా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైన అంశం విమాన టైర్లు. విమానం సుర‌క్షితంగా ప్రయాణించేందుకు ముందు ఇందులో సరైన మోతాదులో గాలిని నింప‌డం, అలాగే అన్ని సరిగా ఉండ‌డం కీల‌కం. అయితే తాజాగా ఓ వీడియోలో ఒక పైలెట్ విమానం టైర్ల‌లో గాలి లేక‌పోవ‌డంతో సైకిల్ టైర్ల‌లో గాలి నింపే పంపు స‌హాయంతో గాలి కొట్ట‌డం కనిపిస్తుంది. ఈ వీడియోలో ఓ చార్ట‌ర్ ఫ్లైయిట్ ర‌న్‌వేపై ఆగిన విమానం కనపడుతుంది.

ఆ విమానం టైర్లలో గాలి లేకుండా ఉండడం గమనించవచ్చు. దీంతో నేరుగా ఆ విమానం పైలెట్ రంగంలోకి దిగిన‌ట్టుగా అనిపిస్తుంది. సైకిల్ కు గాలి కొట్టే పంపుతో గాలి నింప‌డం మనం వీడియోలో చూడవచ్చు. ఈ ఘటనను కొంద‌రు స్మార్ట్ ఫోన్‌లో చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసారు. అంతే ఆ వీడియో కాస్త నెట్టింట్లో దుమారం రేపుతోంది. ఈ వీడియోను చుసిన నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. మరి ఈ వీడియోను చూసిన మీకు ఏమి అనిపించిందో ఓ కామెంట్ రూపంలో తెలపండి.

Exit mobile version