అద్దంకి దయాకర్‌కు ఇచ్చిన మాట సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని జాతీయ మాలమహానాడు తెలంగాణ అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. పదేపదే అద్దంకిని అవమానించడం సమంజసం కాదని, తెలంగాణ ఉద్యమకారుడిని కాంగ్రెస్ అవమానపరుస్తుందన్నారు. అద్దంకి రాజకీయ ఎదుగుదలను అడ్డుకునే శక్తులను బయటపెట్టాలని పిల్లి సుధాకర్ డిమాండ్ చేశారు. అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంపై జాతీయ మాలమహానాడు ఆందోళనకు దిగింది. ట్యాంక్ బండ్ అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లి సుధాకర్ మాట్లాడారు.
‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. పదేపదే అద్దంకిని అవమానించడం సమంజసం కాదు. తెలంగాణ ఉద్యమకారుడిని కాంగ్రెస్ అవమానపరుస్తుంది. అద్దంకి రాజకీయ ఎదుగుదలను అడ్డుకునే శక్తులను బయటపెట్టాలి. ఎమ్మెల్సీ నామినేషన్ వేయమని చెప్పి.. చివరి నిమిషంలో పేరు మార్చడం అద్దంకిని అవమానించడమే. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు తెలంగాణ పరిణామాలపై దృష్టి పెట్టాలి. అద్దంకిని అడ్డుకునే శక్తులను నిర్వీర్యం చేయడానికి తెలంగాణ పౌరసమాజం ఏకం కావాలి. అద్దంకికి సముచిత స్థానం కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం’ అని పిల్లి సుధాకర్ హెచ్చరించారు.
Also Read: KTR: ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు: కేటీఆర్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ బుధవారం ప్రకటించించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావు (బల్మూరి వెంకట్), పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌లను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. తొలుత రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌కు, బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేయగా.. చివరి నిమిషంలో అద్దంకికి పార్టీ అధిష్టానం ఝలక్ ఇచ్చింది.