NTV Telugu Site icon

Viral Video: ఓరి నాయనో.. ఇదేం పిచ్చి సామి..పందితో తింటున్న యువకుడు..

Funny

Funny

ఈరోజుల్లో మనుషుల కన్నా జంతువులకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు.. ఎక్కువ మంది ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు.. ఇక వాటిని సొంత కుటుంబ సభ్యులు మాదిరిగా పెంచుకుంటారు.. అంతేకాదు వాటికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఉండడానికి, తినడానికి కూడా ప్రత్యేక పాత్రలు ఏర్పాటు చేస్తారు.. వాటికి తినడానికి ప్రత్యేక పాత్రలు, మనుషులకు ప్రత్యేక పాత్రలు ప్రతి ఇంట్లో ఉంటాయి. వాటిని ఎప్పుడూ కలపరు. కానీ మనుషులు, జంతువులు ఒకే పాత్రల నుండి ఆహారాన్ని తినడం అనే ప్రశ్నే లేదు. అయితే ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

ఆ వీడియోలో ఓ వ్యక్తి పందితో పాటు తినడం కనిపిస్తుంది.. అక్కడ ఓ తొట్టిలో చాలా నూడుల్స్‌తో నింపబడి ఉంది. ఆ గిన్నెలో ఒక వైపు పంది, మరొక వైపు ఒక వ్యక్తి దానిని తింటూ బిజీగా ఉన్నారు. పంది కూడా చాలా వేగంగా నూడుల్స్ తింటుంది. పందితో పాటు, వ్యక్తి కూడా తన రెండు చేతులతో నోటిలో నూడుల్స్‌ను త్వరగా తినాలని ప్రయత్నం చేస్తాడు.. వీడియోను చూస్తుంటే ఆ వ్యక్తికి పందికి మధ్య పోటి నెలకొందేమో అనే సందేహం వస్తుంది..

ఆ వీడియోలో పందిని చూస్తూ ఆ వ్యక్తి బాగా కుమ్మేస్తాడు.. పంది తినే విధానం అందరూ చూసి ఉంటారు. అయితే ఆ వ్యక్తి తినే విధంగా ఎవరూ తినరు. ఈ వీడియో ప్రజల మనసులను కదిలించింది. ఇలా ఎవరైనా తింటారా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు.. ఈ వీడియోను చూసిన వారంతా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..ఇప్పటివరకు 3.8 మిలియన్లు అంటే 38 లక్షల సార్లు వీక్షించబడింది. అయితే 33 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు… ఇదేం కక్కుర్తి రా సామి అంటూ వింత వింత కామెంట్స్ చేస్తున్నారు.. మీరు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..

Show comments