Pickle In Hotel Meals: మనం అప్పుడప్పుడు భోజనాలు చేయడానికి రెస్టారెంట్ కి వెళ్లడం జరుగుతూ ఉంటుంది. అయితే అలా రెస్టారెంట్ కి వెళ్ళిన సమయంలో మనకు నచ్చిన ఫుడ్ ని ఆర్డర్ చేసి తినడం మామూలే. ఇకపోతే ఓ రెస్టారెంట్ భోజనంలో పచ్చడి ఇవ్వనందుకు ఓ వ్యక్తి చేసిన పిర్యాదు మేరకు కోర్టు ఏకంగా రెస్టారెంట్ యాజమాన్యానికి భారీ జరిమానాన్ని విధించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Mamata Banerjee: నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని నిలదీస్తా..
తమిళనాడు రాష్ట్రం విల్లుపురం బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రెస్టారెంట్ లో పార్సల్ భోజనంలో 11 వస్తువులను ఇస్తామని తెలిపారు. 2022లో వలుతారెడ్డి ప్రాంతానికి చెందిన ఆరోగ్య స్వామి అనే వ్యక్తి ఆ రెస్టారెంట్లో 25 మందికి గాను భోజనం 2000 చెల్లించి భోజనం పార్క్ల్స్ ను కొనుగోలు చేశాడు. ఆ సమయంలో అక్కడి భోజనం ధరపై ఆరా తీయగా.. అక్కడ అన్నంతో పాటు మిగతా ఐటమ్స్ మొత్తం 11 రకాలు ఇస్తామని తెలిపారు. 11 ఐటమ్స్ కలిపిన భోజనం ఖరీదు 80 రూపాయలు అని రెస్టారెంట్ యజమాని తెలిపారు. దాంతో సదరు వ్యక్తి రెస్టారెంట్ నుంచి 2000 చెల్లించి పార్సల్స్ తీసుకున్నారు. అయితే పార్సల్ తీసుకుని వెళ్లిన తర్వాత భోజనం చేస్తుండగా అతడి పార్సల్ లో వారికి ఊరగాయ కనిపించలేదు. దాంతో 11 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయని చెప్పిన ఆ హోటల్ యజమాని వెళ్లి అడగగా వారు అతడికి సమాధానం చెప్పకపోగా.. అతనిపై దురుసుగా ప్రవర్తించారు.
AP Government: మైనార్టీ విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. ఉచితంగా శిక్షణ..
దీంతో కోపం తెచ్చుకున్న ఆరోగ్య స్వామి వెంటనే ఆ హోటల్ పై కన్జ్యూమర్ కోర్టులో కేసు వేశాడు. ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలను న్యాయస్థానం పూర్తిగా పరిగణంలోకి తీసుకొని భోజనంలో ఊరగాయ పచ్చడి అందించకపోవడం ద్వారా పిటిషనర్ కు మానసిక శోభ కలిగినందుకు.. సగటు ఆ రెస్టారెంట్ కు జరిమానంగా రూ. 35,000 చెల్లించాలని, అలాగే పచ్చడికి 25 రూపాయలు చెల్లించాలని రెస్టారెంట్ యజమానాన్ని కోర్ట్ ఆదేశించింది. అంతేకాదు అతనికి డబ్బులు కట్టాలని కోర్టు ఆదేశించింది.