NTV Telugu Site icon

PI Meena : ఓటీటీ లోకి రాబోతున్న సరికొత్త క్రైమ్ డిటెక్టివ్ థ్రిల్లర్..

Whatsapp Image 2023 11 01 At 6.38.53 Pm

Whatsapp Image 2023 11 01 At 6.38.53 Pm

ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు గ్రిప్పింగ్ అండ్ థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ డిటెక్టివ్ డ్రామా వెబ్ సిరీస్ పీఐ మీనా స్ట్రీమింగ్ కానుంది.. ఇందులో పరంబ్రత ఛటోపాధ్యాయ, జిష్షూసేన్ గుప్తా, తాన్యా మానిక్తలా ప్రధాన పాత్రలు పోషించారు.అలాగే వినయ్ పాఠక్, జరీనా వాహబ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ కు దేబాలోయ్ భట్టచార్య దర్శకత్వం వహించగా.. అరిందమ్ మిత్ర నిర్మాత గా వ్యవహరించారు.అనుమానాస్పద సంఘటనల వెనుక ఉన్న మిస్టరీనీ ఛేదించడానికి ఓ ప్రైవేట్ డిటెక్టివ్ అయిన మీనా పాత్ర చుట్టూ ఈ సిరీస్ ఉంటుందని సమాచారం. ఎన్నెన్నో ట్విస్ట్ లతో నిండి ఉన్న ఈ వెబ్ సిరీస్‌ను హిందీ తో పాటు తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 3 వ తేది నుంచి పీఐ మీనా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

పీఐ మీనా వెబ్ సిరీస్ గురించి డైరెక్టర్ దేబాలోయ్ భట్టచార్య ఆసక్తికర విషయాలు తెలిపారు. “నాకు ఎప్పుడూ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ పట్ల ఎంతో ఆసక్తి ఉండేది. ఆ జోనర్‌ ఎంతగానో నచ్చడం వల్లే ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించాను. పీఐ మీనా వెబ్ సిరీస్ నా మొదటి ప్రయత్నం. ఈ వెబ్ సిరీస్ అందరినీ కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది. కథ కు జీవం పోయడం మాత్రమే డైరెక్టర్‌ గా నేను చేశాను” అని డైరెక్టర్ దేబాలోయ్ భట్టచార్య పేర్కొన్నాడు. “స్క్రిప్టు లో పేజీలను సినిమాలాగా, వెబ్ సిరీస్ లాగా ముఖ్యంగా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దడం ఎంతో కష్టమైన పని. కానీ, ఎంతోమంది సహాయ సహకారాలు అందించడం వల్లే ఈ వెబ్ సిరీస్ ను నేను తెరకెక్కించగలిగాను. ఈ వెబ్ సిరీస్‌ ను ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారో చూడాలని ఉంది” అని దేబాలోయ్ భట్టచార్య తెలియజేసారు..

Show comments