Site icon NTV Telugu

Physical Harassment: ప్రైవేట్ స్కూళ్ళో LKG విద్యార్థినికి వేధింపులు.. కీచక డ్రైవర్ అరెస్ట్

Harassment

Harassment

లైంగిక దాడులకు అంతే లేకుండా పోతోంది. ఎన్నిచట్టాలు వచ్చినా కీచకుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఓ ప్రైవేట్ స్కూళ్ళో డ్రైవర్ ముక్కుపచ్చలారని చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆ కీచక డ్రైవర్ పనిపట్టారు. బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూళ్ళో ఈ ఘటన జరిగింది. దీంతో ఆ కీచక డ్రైవర్ ని అరెస్ట్ చేశారు పోలీసులు.. కీచక డ్రైవర్ రజనీ కుమార్‌ను అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు అతని ఫోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. ఎల్‌కేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు డ్రైవర్ రజనీకుమార్.

ఘటన తెలిసిన వెంటనే తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. డ్రైవర్‌ను కొట్టి పోలీసులకు అప్పగించారు కుటుంబ సభ్యులు. మరికొంత మంది విద్యార్థులపై డ్రైవర్ వేధింపులకు పాల్పడ్డాడని అనుమానం వ్యక్తం చేశారు. స్కూల్ ప్రాంగణంలోని సీసీ ఫుటేజ్‌ను స్వాధీన పర్చుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల తల్లిండ్రులు ఆందోళన చేస్తారన్న అనుమానంతో స్కూల్ మూసివేశారు. పాఠశాల లైసెన్స్‌ను రద్దు చేయాలని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. డీఏవీ స్కూల్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. లైంగిక దాడి కేసులో డ్రైవర్ రజిని కుమార్ తో పాటు ప్రిన్సిపాల్ మాధవిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మాధవి పై కేసు నమోదయింది. ఇద్దరిని కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు పోలీసులు.గత పన్నెండేళ్ళుగా ఇదే స్కూళ్ళో క్లీనర్ గా, డ్రైవర్ గా పని చేస్తున్నాడు రజినీకుమార్.

Read Also:Karumuri Nageswararao: పవన్.. యువతకు రౌడీయిజం నేర్పిస్తున్నారా?

నిందితుడిపై అత్యాచారం కేసుతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. దీంతో డ్రైవర్ కు 20 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. స్కూళ్ళో ఘటన జరగడంతో ప్రిన్సిపాల్ మాధవిపై ఆరోపణలు వచ్చాయి. డ్రైవర్ రజిని కుమార్ ఘటన తరువాత కూడా అతనిని కాపాడే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ గా వున్న మాధవి పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Read Also: Karumuri Nageswararao: పవన్.. యువతకు రౌడీయిజం నేర్పిస్తున్నారా?

Exit mobile version