NTV Telugu Site icon

Maoist Rajitha : మావోయిస్టు కీలక నేతపై లైంగిక వేధింపుల కేసు

Maoist

Maoist

మావోయిస్టు నేత, అల్లూరి , భద్రాద్రికొత్తగూడెం జిల్లాపార్టీ కార్యదర్శి ఆజాద్ ఆలియాస్ సాంబయ్య పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. దళంలో మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు మేరకు కేసును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు ఇచ్చినది కూడ మావోయిస్టు కీలక నేత దామోదర్ భార్య రజిత కావడం ప్రత్యేకత సంతరించుకుంది. ఈనెల మొదటి వారంలో ఛత్తీస్ గడ్ అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయ్యారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి పలువురు మహిళలను అరెస్టు చేశారు. అలా అరెస్టు అయిన వారిలో రజిత ఆలియాస్ మడకం కోసి ఉంది. ఈ మడకం కోసిని పోలీసులు రిమాండుకు తరలించారు. ఆమె మావోయిస్టు కీలక నేత దామోదర్ భార్య కూడ. ఆమె దళంలో కీలకంగా వున్న వ్యక్తి. ఆమెపై 80కి పైగా కేసులు కూడ ఉన్నాయి. ఇదే విషయాన్ని భద్రాద్రి జిల్లా ఎస్పీ వినీత్ స్పష్టం చేశారు. అయితే ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆ తరువాత ఆమె ప్రస్తుత అల్లురి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మావోయిస్టు కార్యదర్శి ఆజాద్ ఆలియాస్ సాంబయ్య పై ఫిర్యాదు చేసింది.

 

కొన్ని రోజుల క్రితం గండ్రాజిగూడెం వద్ద మావోయిస్టు పార్టీ సభ్యులు సమావేశం అయిన సందర్బంగా మహిళ దళ సభ్యులతో ఆజాద్ అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేసింది. అదే విధంగా మరో మహిళ ఆజాద్ వేధింపులను తట్టుకోలేక ఇంటికి వెళ్లి పోయిందని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా ఆజాద్ అనేక పార్టీ ఫండ్ పేరుతో అక్రమంగా డబ్బులు వసూళ్లుచేసే వాడని చర్ల పోలీసులు ప్రకటన జారీ చేశారు. అయితే ఈ విషయంలో పార్టీ నాయకత్వం కూడా ఆజాద్ ను మందలించినట్లుగా రజిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టం చేసింది. అయితే రజిత పోలీసులకు పట్టుపడిన తరువాత ఇటువంటి ఫిర్యాదును ఆజాద్ మీద ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తుంది.