Site icon NTV Telugu

Maharashtra: లిఫ్ట్ ఇస్తామని చెప్పి మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..

Maharshtara

Maharshtara

Physical assault on teenage girl in Nagpur: దేశంలో ఎన్ని చట్టాల వచ్చినా ఆడవాళ్లపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దిశ, నిర్భయం, పోక్సో వంటి చట్టాలు ఉన్నా కూడా కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. వావీవరస, చిన్నా పెద్దా అనే బేధం లేకుండా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు దేశంలో ఎక్కడో చోట వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. లిఫ్ట్ ఇస్తామనే నెపంతో కారులో ఒకరితర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్ పూర్ నగరంలో చోటు చేసుకుంది.

Read Also: PM Narendra Modi: భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

వివరాల్లోకి వెళితే.. నాగ్‌పూర్ జిల్లాలో కారులో లిఫ్ట్ ఇస్తామని ఇద్దరు వ్యక్తులు 17 ఏళ్ల బాలికను వాహనంలో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బుధవారం పోలీసులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం నాగ్‌పూర్ కు 40 కిలోమీటర్ల దూరంలోని సావోనర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. లిఫ్ట్ ఇస్తామనే నెపంతో నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

Exit mobile version