Site icon NTV Telugu

Viral video: ప్రాణాపాయంలో ఉన్న చిరుతను కాపాడిన వ్యక్తి.. చివరికి అది ఏం చేసిందంటే?

Cheeta

Cheeta

Viral video: అడవి జంతువులు చాలా క్రూరంగా ఉంటాయి. చిరుతలు, పులులు, సింహాలు అంటే ఇంకా భయంకరంగా ఉంటాయి. జంతువులైనా, మనుషులైనా ఏవైనా వాటి ముందుకు వస్తే వాటికి ఆహారం కావాల్సిందే. అవి బలహీనంగా ఉన్నా వేటాడాలి అనుకుంటే చాలా చురుకుగా ఉంటాయి. టార్గెట్ మిస్ కాకుండా ఒక్క పంజాతో వాటిని మట్టి కరిపిస్తాయి. వాటి వేట ఎంత వేగంగా ఉంటుందో, అవి ఎంత స్పీడ్ గా పరిగెడుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అటువంటి చిరుత పులి ఒకటి లేవలేక ఆనారోగ్యంతో పడి ఉంటే ఓ వ్యక్తి దానికి వైద్యం చేయించి కాపాడతాడు. అయితే ఆ తరువాత ఆ చిరుత చేసిన పని ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Also Read: COVID19: షాకింగ్ సర్వే.. కరోనా నుంచి కోలుకున్న ప్రతి వందమందిలో ఆరుగురు ఏడాదిలోపే మృతి

వీడియో ఓ చిరుత అనారోగ్యంతో ఉంటుంది. దానిని గమనించిన ఓ ఫోటోగ్రాఫర్ దాని దగ్గరకు వెళ్లి చేతితో దానికి నీరు తాగిస్తాడు. వాళ్ల స్నేహితుల సాయంతో దానికి వైద్యం ఆరోగ్యంగా మారుస్తాడు. అయితే అంత క్రూరజంతువైన చిరుత కూడా కోలుకున్న తరువాత అతడిని ఆప్యాయంగా హత్తుకుంటుంది. చికిత్స తరువాత ఆ ఫోటోగ్రాఫర్ దానిని అడవిలో వదిలిపెట్టాడు. అది వెళుతుండగా ఫోటోగ్రాఫర్ ఫోటో తీయబోగా అది వచ్చి కెమెరా ముందు నిలుచోని ఫోటోకు ఫోజులిచ్చింది. ఎప్పుడు ఫోటోలు తీయడానికి అడవికి వెళ్లినా తనకు కావాల్సిన వారు ఎవరో వచ్చారు అన్నట్టుగా అతడికి దగ్గరగా వచ్చి పట్టుకుంటుంది. అతడికి ప్రేమ చూపెడుతూ అతని ముఖాన్ని తన ముఖంతో తడుముతుంది. అలా చేస్తూ ఆ చిరుత ఫోటోగ్రాఫర్ పట్ల కృతజ్ఞత తెలియజేస్తుంది. ఈ వీడియో చూస్తే చిరుతకు ఫోటోగ్రాఫర్ పై ఉన్న ప్రేమ స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ వీడియోను హకన్ కపుకు ( Hakan Kapucu) అనే ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిని జంతువులకు కృతజ్ఞత, జాలి ఉంటాయి అని క్యాప్షన్ జోడించి పోస్ట్ చేశారు. ఇక ఇది చూసిన నెటిజన్లు ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఇది అని కామెంట్ చేస్తున్నారు. మనుషులు జంతువుల నుంచి నేర్చుకోవాలి అని మరొకరు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. వీరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఇక చిరతను కాపాడినందుకు ఫోటోగ్రాఫర్ మంచి మనసును చాలా మంది మెచ్చకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే 40 లక్షల వరకు వీక్షించారు. లక్ష మంది వరకు లైక్ చేశారు.

Exit mobile version