Site icon NTV Telugu

Bandi Sanjay: ఆ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి సిట్ నోటీసులు..

Bandi Sanjay

Bandi Sanjay

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈనెల24న విచారణకు రావాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సిట్ నోటీసులు జారీ చేసింది. కేంద్ర మంత్రితోపాటు పీఆర్వో, పీఏలకూ సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ లో స్టేట్ మెంట్ ఇచ్చేందుకు బండి సంజయ్ అంగీకరించారు. అదేరోజు పీఆర్వో మధు, పీఏ ప్రవీణ్ ల స్టేట్ మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి నివాసానికి వచ్చిన సిట్ అధికారులు నోటీసులందించారు. కొద్దిరోజుల క్రితమే బండి సంజయ్ వ్యక్తిగత డ్రైవర్ రమేశ్ ను పిలిచి స్టేట్ మెంట్ రికార్డు చేశారు.

READ MORE; Supreme Court: 12 ఏళ్ల చిన్నారి కథ విని చలించిన సుప్రీంకోర్టు.. తప్పును అంగీకరించిన న్యాయస్థానం..

కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు చెందిన ఫోన్లను గత ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో సిట్ పలువురు నేతలను పిలిచి వాంగ్మూలం తీసుకుంటోంది. తాజా బండి సంజయ్ స్టేట్‌మెంట్‌ను కూడా రికార్టు చేయనుంది.

READ MORE; Rk Roja: రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు.. మాజీమంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

Exit mobile version