Site icon NTV Telugu

Phone tapping case: నేడు సిట్ విచారణకు హాజరుకానున్న మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు..!

Phone Tapping Case

Phone Tapping Case

Phone tapping case: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ మరింత వేగం పుంజుకుంటోంది. ఈ కేసులో A1గా ఉన్న ఆయనను ఇటీవల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ప్రశ్నించారు. తాజాగా, నేడు మరోసారి ఆయన సిట్ విచారణకు హాజరుకాబోతున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయంలో ఈ రోజు (జులై 10) విచారణ జరగనుంది.

Read Also:HCA IPL Tickets Scam: సీఐడీ విచారణ వేగవంతం.. కస్టడీలోకి ఐదుగురు కీలక వ్యక్తులు..!

ఇప్పటికే సిట్ అధికారులు నిందితులు, సాక్షుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేసిన నేపథ్యంలో.. వాటిని ఆధారంగా చేసుకుని ప్రభాకర్ రావును మరింత లోతుగా ప్రశ్నించనున్నట్టు సమాచారం. ఈ కేసులో ట్యాపింగ్‌కు గురైన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి నేడు సిట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఆయన ఇచ్చే స్టేట్‌మెంట్‌ ఆధారంగా కూడా ప్రభాకర్‌ రావుపై మరిన్ని ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజానిజాలపై స్పష్టత రాబట్టేందుకు సిట్ అడుగులు వేగంగా సాగుతోంది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, అధికారులు ప్రతి అంశాన్ని క్షున్నంగా పరిశీలిస్తున్నారు.

Read Also:KCR Health Update: నేడు మరోసారి యశోదా హాస్పిటల్‌కు వెళ్లనున్న మాజీ సీఎం..!

ఈ విచారణ నేపథ్యంలో ప్రభాకర్ రావు సమాధానాలు, ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి వాంగ్మూలం కీలకంగా మారనున్నాయి. ట్యాపింగ్ కేసులో ఉన్న మిగిలిన నిందితులపై తదుపరి చర్యలు కూడా ఇదే ఆధారంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version