NTV Telugu Site icon

Power outage at Airport: ఎయిర్ పోర్టుకు పవర్ కట్.. నిలిచిన 282విమాన సర్వీసులు

Mania Airport

Mania Airport

Power outage at Airport: ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలోని నినోయ్‌ అక్వినో ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టుకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దాంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో విమాన ప్రయాణికులకు నూతన సంవత్సరం తొలిరోజే చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్టులో చాలాసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అధికారులు బ్యాకప్‌ పవర్‌ అందించే ప్రయత్నం చేశారు. కానీ సాంకేతిక సమస్య తలెత్తడంతో బ్యాకప్‌ పవర్‌ సప్లయ్‌ కాలేదు. ఇతర దేశాల నుంచి వచ్చే విమానాలను మనీలా విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయకుండా దారి మళ్లించారు.

Read Also: Helicopters Collide : చూస్తుండగానే ఘోరం.. గాల్లోనే ఢీ కొన్న రెండు హెలికాప్టర్లు.. పలువురి మృత్యువాత

దాంతో 50 వేల మంది ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు పడాల్సి వచ్చింది. క్రిస్‌మస్‌ పండుగ, కొత్త సంవత్సరం నేపథ్యంలో సెలవులను ఎంజాయ్‌ చేయడానికి విదేశీ పర్యాటకులు భారీ సంఖ్యలో ఫిలిప్పీన్స్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ అంతరాయం కారణంగా ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థ పాడైపోయిందని, ఇతర వ్యవస్థలు లేకపోవడమే ట్రాఫిక్ అంతరాయానికి కారణమని ఫిలిప్పీన్స్ రవాణా శాఖ కార్యదర్శి జైమ్ బాటిస్టా తెలిపారు. లోపం పాక్షికంగా పరిష్కరించబడిన తరువాత సాయంత్రం వరకు విమాన రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

Show comments