Site icon NTV Telugu

Petrol Rate: రాష్ట్ర బడ్జెట్‌లో సామాన్యులకు షాక్.. పెట్రోల్ ధర రూ.2 పెంపు

Petrol Price

Petrol Price

Petrol Rate: కేరళ సర్కారు సామాన్యులకు షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరను రూ.2 పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. వ్యక్తిగత వినియోగం కోసం కొత్తగా కొనుగోలు చేసిన కార్లు, ప్రైవేట్ సర్వీస్ వాహనాలపై ట్యాక్స్​ పెంచనున్నట్లు కూడా వెల్లడించింది. శుక్రవారం రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్‌ వేణుగోపాల్ ఈ విషయాన్ని ప్రకటించారు. సోషల్ సెక్యూరిటీ సీడ్ ఫండ్‌కు రూ.750 కోట్ల అదనపు ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై సెస్ విధిస్తున్నట్లు తెలిపారు.

Telangan Assembly: 24 గంటల విద్యుత్‌ సరఫరాతో రాష్ట్రంలో వెలుగులు.. సాఫీగా గవర్నర్‌ ప్రసంగం..

వ్యక్తిగత వినియోగం కోసం కొత్తగా కొనుగోలు చేసిన కార్లు, ప్రైవేట్ సర్వీస్ వాహనాలపై ట్యాక్స్​ పెంచనున్నట్లు కూడా మంత్రి ప్రకటించారు. ఎలక్ట్రిక్ మోటార్ క్యాబ్‌లపై వన్-టైమ్ ట్యాక్స్‌ను 5 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. కేరళలో గల విళింజం ఓడరేవు చుట్టూ ఉన్న ప్రాంతంలో విస్తృతమైన పారిశ్రామిక, వాణిజ్య కేంద్ర అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్‌లో రబ్బరు సబ్సిడీకి రూ.600 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. గవర్నర్ ప్రసంగంతో కేరళ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మార్చి 30 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.

Exit mobile version