Mileage Tips: ఏ టైంలో పెట్రోల్, డీజిల్ కొట్టిస్తే రెట్టింపు ప్రయోజనం..? నిజమెంత..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mileage Tips: పెట్రోల్, డీజిల్ కొట్టించే సమయాన్ని బట్టి మైలేజ్ ఇస్తుందా? ఏ సమయంలో చమురు కొట్టిస్తే ఎంత ఉపయోగం.. ఏ టైంలో పెట్రోల్ కొట్టిస్తే నష్టం అనే విషయంపై సోషల్ మీడియోలో ఓ రచ్చ నడుస్తోంది. అసలే చమురు ధరలకు రెక్కలు వచ్చాయి.. పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీంతో ప్రజలు తమ వాహనాలను బయటకు తీసేందుకు జంకుతున్నారు. చాలా పొదుపుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో ఎక్కువ మైలేజీ ఇచ్చే వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఎవరైనా ఎక్కువ మైలేజీ రావాలని కోరుకుంటారు.. మైలేజీ వాహనం పరంగానే కాదు.. ఇంధనం నింపుకునే సమయం కూడా ప్రభావితం చేస్తుంది. అవును.. పెట్రోలు, డీజిల్ నింపుకునే సమయం వచ్చిందని పలువురు వాదిస్తున్నారు. ఉదయాన్నే పెట్రోలు నింపుకుంటే మంచిదని కొందరు అంటుంటే.. మరికొందరు రాత్రిపూట పెట్రోలు నింపుకుంటే మంచిదని అంటున్నారు. మరి ఏ సమయంలో పెట్రోలు నింపడం ప్రయోజనకరం? ఈ వాదనల్లో నిజం ఏమిటి? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఇంతకీ ఈ వాదనలో నిజం ఉందా? నిజంగా పెట్రోల్, డీజిల్ కొట్టించే సమయం మైలేజీపై ప్రభావం చూపిస్తుందా? అసలు నిజం ఏమిటి? అంటే వ్యక్తుల ప్రకారం.. ఇంధనం సంకోచం మరియు విస్తరణ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. వేడి కారణంగా ఇంధనం సన్నగా మారుతుంది. అదే ఉదయం తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా కాస్త దట్టంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో పెట్రోల్ నింపడం వల్ల తక్కువ డబ్బుతో సాధారణం కంటే కొంచెం ఎక్కువ పెట్రోల్ ఖర్చవుతుందని వాది వాదనగా ఉంది. ఇక, స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఇంధనం ఉంటుంది.. అయితే, పెట్రోల్ మరియు డీజిల్ స్టేషన్లు వాస్తవానికి ఇంధనాన్ని భూగర్భ ట్యాంకుల్లో నిల్వ చేస్తాయి. కాబట్టి.. అక్కడ పెట్రోల్, డీజిల్ స్థిరమైన ఉష్ణోగ్రతలో ఉంటాయి. మరియు ఈ ట్యాంకులు చాలా మందపాటి టైర్లతో తయారు చేయడి ఉంటాయి.. కాబట్టి అది ఎలాంటి ప్రభావం చూపదంటున్నారు.
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
అసలు ఇందులో నిజముందా? ఏది వాస్తవం అనే విషయంలోకి వెళ్తే.. స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఇంధనాన్ని నిల్వ చేయడం ద్వారా, ఉష్ణోగ్రత ఇంధనాన్ని ప్రభావితం చేయదు. పెట్రోల్ మరియు డీజిల్ సాంద్రతలో తేడా లేదు. దీన్నిబట్టి.. పగటిపూట పెట్రోల్ కొన్నారా? రాత్రిపూట పెట్రోల్ కొంటారా? ఎలాంటి తేడా లేదని నిపుణులు చెబుతున్నారు. అంటే… ఏ సమయంలో తమ వాహనంలో ఇంధనం కొట్టించుకున్నా.. ఆ వాహనాన్ని బట్టి సమాంతర ప్రయోజనం ఉంటుంది తప్పా.. ఒక్కో సమయాన్ని బట్టి ఇక్కో విధంగా ప్రభావితం చేయదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు..
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!