Volunteers Resignation: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో విలేజ్/వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవహారం కాకరేపుతోంది.. అయితే, మూకుమ్మడిగా వాలంటీర్లు రాజీనామా చేయడం చర్చగా మారింది.. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఏపీలో వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టులో బోడే రామచంద్ర యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు.. బీసీవై పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బోడే రామచంద్ర యాదవ్.. వాలంటీర్ల రాజీనామాలు ఆమోదిస్తే వీరంతా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తారని, ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు పక్కదారి పడతాయని తన పిటిషన్ ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. అంతేకాదు.. వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.. ఇక, ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరంగా ఉండాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్న పిటిషనర్.. ఈ ఆదేశాల నేపథ్యంలో 44 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్టు తన పిటిషన్ ద్వారా హైకోర్టుకి సమాచారం చేరవేశారు.. దీనిపై రేపు విచారణ చేపట్టనున్నట్టు హైకోర్టు పేర్కొంది.
Read Also: Balineni Srinivas Reddy: ఆరోసారి గెలిచి సిక్స్ కొట్టబోతున్నా.. ఒంగోలుకు నా హామీలు ఇవే..