హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఏనుగు కేర్ టేకర్ పై దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. నేటి (శనివారం) సాయంత్రం ఏనుగుల సఫారీలో విధుల్లో ఉన్న షాబాజ్ అనే మావటిపై ఓ ఏనుగు సడెన్ గా దాడి చేసింది. సాధారణంగా ఏనుగుల సఫారీలో ఐదారుగురు మావటిలు డ్యూటీలో ఉంటారు. శనివారం జూపార్క్ 60 సంవత్సరాల వేడుకల సందర్భంగా కొంత మంది అక్కడి విందుకి వెళ్లారు.. ఆదే సమయంలో షాబాజ్ ఒక్కరే డ్యూటీలో ఉన్నాడు.
Read Also: BV Raghavulu: అసమానతలు లేని అభివృద్ధి కావాలి.. రాష్ట్రంలో యథేచ్ఛగా ఆస్తుల లూఠీ, నిధుల దోపిడీ..!
అయితే, ఒక్కసారిగా ఏనుగు ముందుకు దూసుకొచ్చి అతడ్ని నేలకేసి కొట్టడంతో.. తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో ఉన్న బాధితుడిని అక్కడి సిబ్బంది డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, పరీక్షించిన డాక్టర్లు.. అప్పటికే షాబాజ్ మృతి చెందినట్లు ధృవీకరించారు. షాబాద్ మరణించాడు అనే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు.