NTV Telugu Site icon

Mcdonald: మెక్‌డొనాల్డ్ బర్గర్ తిని 49 మందికి అస్వస్థత.. ఒకరు మృతి

Burger

Burger

Mcdonald: మెక్‌డొనాల్డ్.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దీనికి కారణం ప్రపంచ వ్యాప్తంగా ఇందుకు సంబంధించి పెద్ద సంఖ్యలో అవుట్ లెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా నగరాలూ, పట్టణాల్లో ఇవి కనపడుతాయి. ఇకపోతే, ఇప్పుడు అమెరికాలోని ప్రజలు మెక్‌డొనాల్డ్ బర్గర్‌ల గురించి భయాందోళనలకు గురవుతున్నారు. కొలరాడోలో బర్గర్ల కారణంగా ‘E. coli’ అనే వ్యాధి వస్తుందని బయటపడింది. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) మెక్‌డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్‌లతో ముడిపడి ఉన్న E. coli వ్యాధి వ్యాప్తి 10 రాష్ట్రాల్లో 49 మందిని అస్వస్థతకు గురి చేసిందని, అందులో 10 మంది ఆసుపత్రిలో ఉన్నారని నిర్ధారించింది. కొలరాడోలో 26 మంది అనారోగ్యంతో ఉన్న వారు ఎక్కువగా ప్రభావితమయ్యారు.

Read Also: Mcdonald: మెక్‌డొనాల్డ్ బర్గర్ తిని 49 మందికి అస్వస్థత.. ఒకరు మృతి

ఇక ఈ కేసు విచారణలో భాగంగా ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ముందు మెక్‌డొనాల్డ్స్‌లో బర్గర్‌లు తిన్నట్లు దర్యాప్తులో తేలిందని, వారిలో ఎక్కువ మంది క్వార్టర్ పౌండర్ హాంబర్గర్‌లు తిన్నట్లు నివేదించారని CDC అధికారులు తెలిపారు. అనారోగ్యానికి సంబంధించిన నిర్దిష్ట పదార్ధం గుర్తించబడలేదని, అయితే పరిశోధకులు తరిగిన ఉల్లిపాయలు ఇంకా గొడ్డు మాంసంను అనుమానిస్తున్నారని అధికారులు తెలిపారు. కొలరాడో, నెబ్రాస్కాలో చాలా మంది జబ్బుపడిన వ్యక్తులు కనుగొనబడ్డారు. దింతో ప్రస్తుతం, మెక్‌డొనాల్డ్స్ తరిగిన ఉల్లిపాయలు, గొడ్డు మాంసం, క్వార్టర్ పౌండర్ హాంబర్గర్‌ లను నిలిపివేసింది.

Read Also: Wayanad bypoll: వయనాడ్లో ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు

ఇకపోతే, E. coli కడుపులో తీవ్ర ఇబ్బందులు ఏర్పడడం, జ్వరం, అతిసారం, వాంతులను కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్ ఉన్న చాలా మంది వ్యక్తులు 3 నుండి 4 రోజులు లేదా బ్యాక్టీరియా ఉన్న ఏదైనా తినడం లేదా త్రాగిన తర్వాత 10 రోజుల వరకు అనారోగ్యానికి గురవుతారు. కొంతమంది 5 నుండి 7 రోజుల్లో కోలుకుంటారు. మరికొందరు ఆసుపత్రిలో చేరవలసి వస్తుంది. ఈ E. coli O157:H7 తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది. ఇది హాంబర్గర్లు తినడం ద్వారా 1993 లో అమెరికాలో కనుగొనబడింది. CDC ప్రకటన తర్వాత మెక్‌డొనాల్డ్ షేర్లు మంగళవారం తొమ్మిది శాతం పడిపోయాయి.