Perni Nani: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ముగ్గురూ కలిసి మూడు ఖాకీ చొక్కాలేశారన్నారు. ఆటో డ్రైవర్ సేవలో పేరుతో డ్రైవర్లకు డబ్బులేశామని చెబుతున్నారన్నారు. ఎన్నికల్లో రాష్ట్రమంతా మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారని చెప్పారు. ఎవరైనా అడిగితే నా పేరు చెప్పాడని చంద్రబాబు తెలిపారు. ఎవరైనా ప్రశిస్తే తోలు తీస్తామన్నారని గుర్తు చేశారు. ఏడాదైనా ఫ్రీ బస్సు ఇవ్వకపోవడంతో విమర్శల పాలయ్యారన్నారు. జగన్ మోహన్ రెడ్డి , ప్రజలు, ప్రతిపక్షాల దెబ్బకు చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పారు. ఫ్రీ బస్సులో జిల్లాల సరిహద్దులు దాటడానికి వీల్లేదని సాక్షాత్తూ మంత్రులే చెప్పారన్నారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో పల్లె వెలుగులో రాష్ట్రమంతా తిరగొచ్చని ప్రకటించారని ప్రకటించారు. బస్సులను తగ్గించేశారని చెప్పారు.
READ MORE: Rakshith Atluri: డైరెక్టర్ చెప్పిన కథ నచ్చలేదు.. ఏం చెబుతున్నాడో కూడా అర్థం కాలేదు!
చంద్రబాబు దెబ్బకు ఆటోవాళ్లంతా రోడ్డెక్కారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. “ఎన్నికల్లో ఊకదంపుడు ప్రసంగం చేసిన చంద్రబాబు,పవన్ ను నిలదీశారు. 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు 436 కోట్లు వేశామని చంద్రబాబు చెబుతున్నారు. భూ ప్రపంచం మీద తనే ఆటో డ్రైవర్లను ఆదుకున్నానని బిల్డప్ ఇచ్చారు. చంద్రబాబు స్పీచ్ దెబ్బకు ఆటో డ్రైవర్లకు చెవుల వెంట రక్తం ఒక్కటే తక్కువ. ఆటో వాళ్ల కోసం యాప్ పెడతా.. కంట్రోల్ రూమ్ పెడతానంటున్నారు. ఆటో, క్యాబ్, మ్యాక్సిక్యాబ్ డ్రైవర్లకు పండగే పండగ అని చంద్రబాబు చెబుతున్నారు. చంద్రబాబు తీరు సినిమాలో బ్రహ్మానందం క్యామెడీ సీన్ లా ఉంది. వాహన మిత్ర పథకం ప్రారంభించింది జగన్ మోహన్ రెడ్డి. పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి ఆటో డ్రైవర్ల కష్టాలు తెలుసుకున్నారు. మచిలీపట్నంలో ఆటో డ్రైవర్ల సమస్యలు స్వయంగా విన్నారు. తమకు ఏడాదికి పది వేలైనా ఇవ్వమని ఆటో డ్రైవర్లు అడిగారు. సొంతంగా ఆటో కొనుక్కుని నడుపుకుంటున్న వారికి 10 వేలు ఇస్తామని ఏలూరు వేదికగా ప్రకటించారు. జగన్ సీఎం అయిన వెంటనే.. 2 లక్షల 36 వేల మందికి వాహనమిత్ర ఇచ్చారు. ఎన్నికల సంవత్సరం కూడా జగన్ మోహన్ రెడ్డి 2 లక్షల 75 వేల మందికి వాహన మిత్ర ఇచ్చారు. ఇప్పుడు జగన్ కంటే చంద్రబాబు కేవలం 14 వేల మందికి మాత్రమే అదనంగా ఇచ్చారు.” అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
