‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో కుర్రకారు మనసు దోచుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ఇప్పుడు సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఆమె ఒక యువ నటుడితో ప్రేమలో ఉందని, దానికి సంబంధించి ఒక ఫోటో కూడా లీక్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. అయితే, నిజానికి ఆ ఫోటోను రుక్మిణి స్వయంగా 2023లోనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఉన్నది ఆమె స్నేహితుడు సిద్ధాంత్ నాగ్ అని సమాచారం. సిద్ధాంత్ ప్రస్తుతం నటుడిగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉండగా, రుక్మిణి మాత్రం స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోవడంతో ఈ పాత ఫోటో ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది.
Also Read : Rashmika: జపాన్ ప్రేక్షకుల ప్రేమకు ఫిదా అయిన రష్మిక.. ఎమోషనల్ పోస్ట్!
ప్రస్తుతం రుక్మిణి కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కూడా ఈమె హీరోయిన్‌గా సెలెక్ట్ అవ్వగా. ఈ సినిమా కోసం మేకర్స్ ఆమెకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు టాలీవుడ్ టాక్. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న రుక్మిణి, తన వ్యక్తిగత విషయాలపై వస్తున్న ఈ రూమర్లపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
