Site icon NTV Telugu

Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న పీపుల్స్ స్టార్

Green India

Green India

Green India Challenge: బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్‌లో ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను చేపట్టి ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఎందరినో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ పర్యవరణ పరిరక్షణకు తోడ్పడుతున్నారని అన్నారు. సకాలంలో వర్షాలు కురవాలన్న, వాతావరణంలో మార్పులను అరికట్టాలన్న మొక్కలు నాటడం ద్వారానే సాధ్యమని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు.

Read Also: Harish Rao : పని చేసే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి… సద్దితిన్న రేవు తలవాలి

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నుంచి వలసలు పోయేవారని.. కానీ నేడు తెలంగాణకు వలసలు పెరిగాయని అన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటినందుకు సంతోషంగా ఉందని ఎంపీ సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి మొక్కలు నాటి వాటిని సంరంక్షించాలని సూచించారు.

Exit mobile version