NTV Telugu Site icon

Ponnam Prabhakar : భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Ponnam Prabhakar

Ponnam Prabhakar

భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ,పోలీస్ ,వాటర్ వర్క్స్, విద్యుత్ , డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఎవరు నిరక్ష్యంగా ఉండకూడదని అందరూ విధుల్లో ఉండాలని తెలిపారు..తక్కువ సమయంలో ఒకేసారి భారీ వర్షం నమోదైందని ముఖ్యంగా శేరిలింగంపల్లి , చార్మినార్ ,ఎల్బి నగర్, గోల్కొండ , ఆసిఫ్ నగర్ , షేక్ పెట్ ప్రాంతాల్లో వర్షం నమోదైందని అధికారులు తెలిపారు. 141 వాటర్ లాకింగ్ పాయింట్స్ లలో ప్రత్యేక సిబ్బందిని ఉంచి నీళ్ళు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఎక్కువగా ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో నామ మాత్రపు వర్షం పడిందని పెద్దగా ఇబ్బందులు లేవని మంత్రి  దృష్టికి తీసుకొచ్చారు.. చెట్లు పడిన ప్రాంతాల్లో వెంటనే వాటిని తొలగించాలని సూచించారు.. మరో గంటలో మరోసారి వర్షం పడనుందనే వాతావరణ శాఖ సూచనలతో కమాండ్ కంట్రోల్ నుండి మానిటరింగ్ చేయాలని హైదరాబాద్ సీపీ కి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. టెలి కాన్ఫరెన్స్ లో జీహెచ్ఎంసీ ఇంచార్జి కమిషనర్ ,డైరెక్టర్ ఈవిడిఏం ,జోనల్ కమిషనర్లు, హైదరాబాద్ కలెక్టర్ ,హైదరాబాద్ కలెక్టర్ , హైదరాబాద్ సీపీ తదితర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.