NTV Telugu Site icon

Kurnool: అమ్మ ఒడి వద్దు.. రోడ్డు వేయించండి.. మంత్రికి నిరసన సెగ

Minister Jayaram

Minister Jayaram

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావొస్తున్న నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం కొనసాగుతోంది. అన్ని నియోజకవర్గాల్లోని గ్రామ లేదా వార్డు సచివాలయాలను స్థానిక అధికారులతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. నెలలో 10 సచివాలయాలను సందర్శించేలా ఎమ్మెల్యేలు ప్లాన్ చేసుకుంటున్నారు.

Nara Lokesh: జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్‌తో.. ప్రజలు బతకలేకపోతున్నారు

అయితే కర్నూలు జిల్లాలో చేపట్టిన గడప గడపకు కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాంకు నిరసన సెగ తగిలింది. ఆలూరు మండలం హాత్తిబెళగల్‌లో అమ్మ ఒడి లేకున్నా పర్లేదు.. రోడ్డు వేయించాలని మంత్రి జయరాంను స్థానికులు నిలదీశారు. ఇప్పటివరకు అమ్మ ఒడి డబ్బులు పడలేదని.. అదిపోతే పోయింది.. రోడ్డు మాత్రం బాగు చేయించాలని గ్రామస్తులు కోరారు. మరోవైపు నీటి సమస్య తీవ్రంగా ఉందని.. తాగునీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జయరాం సమక్షంలో గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Show comments