High Inflation : ఆ దేశంలో 211 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం..ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Inflation : ద్రవ్యోల్బణం సమస్య ఏ దేశానికైనా చాలా సున్నితమైనది. అందులోని చిన్నపాటి అవాంతరం కూడా ప్రజల నెలవారి బడ్జెట్‌ను పాడుచేస్తుంది. అయితే ఒక దేశంలో ద్రవ్యోల్బణం 200 శాతానికి పైగా పెరిగింది. దీంతో అక్కడి ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోండి. లాటిన్ అమెరికా దేశమైన అర్జెంటీనా ప్రజలు ఇలాంటి దారుణమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. అక్కడ ద్రవ్యోల్బణం దాదాపు 211 శాతం పెరిగింది. చిన్నా పెద్దా ప్రతి వస్తువు ధర విపరీతంగా పెరిగిపోయి ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి.
అర్జెంటీనా కరెన్సీ పెసో విలువ తగ్గించబడింది. అధ్యక్షుడు జేవియర్ మిల్లీ కొత్త ప్రభుత్వం పెసో విలువను సగానికి తగ్గించింది. దీని కారణంగా ద్రవ్యోల్బణం వేగంగా పెరిగి 2023లో 211 శాతానికి చేరుకుంది. ప్రభుత్వ గణాంక సంస్థ INDEC ప్రకారం.. దేశంలో ద్రవ్యోల్బణం మూడు దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకుంది.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
Read Also:Realme 12 Pro: రియల్‌మీ నుంచి మరో రెండు స్మార్ట్ ఫోన్స్.. ఫీచర్స్ అదుర్స్..
133 శాతం పెరిగిన వడ్డీ రేట్లు
దేశంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వార్షిక డేటా ఆధారంగా, దేశంలో ద్రవ్యోల్బణం పొరుగు దేశం వెనిజులా పరిస్థితికి చేరుకుంది. దక్షిణ అమెరికాలో అత్యధిక ద్రవ్యోల్బణం కలిగిన దేశంగా అర్జెంటీనా అవతరించింది. దేశంలో వడ్డీ రేట్లు కూడా దాదాపు 133 శాతం పెరిగాయి. జేవియర్ మిల్లీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కూడా ప్రజలకు ఎలాంటి ఉపశమనం కలిగించేలా కనిపించడం లేదు. 2022లో దేశంలో ద్రవ్యోల్బణం 95 శాతంగా ఉంది. ఇది కేవలం ఒక్క ఏడాదిలోనే రెండింతలు పెరిగింది. నెలవారీ ద్రవ్యోల్బణం డిసెంబర్ 2023లో 25.5 శాతానికి చేరుకోగా, నవంబర్‌లో అది 12.8 శాతానికి చేరుకుంది. 30 శాతానికి చేరుకుంటుందని ప్రభుత్వం భయపడింది.
గత వారంలో IMF అర్జెంటీనాకు 4.7 బిలియన్ డాలర్ల సాయం అందించాలని నిర్ణయించింది. దేశంలో ఆహార పదార్థాలు కూడా చాలా ఖరీదైనవిగా మారాయి. డిసెంబర్‌లో అర్జెంటీనా కొనుగోలు శక్తి దాదాపు 10 శాతం క్షీణించింది. అలాగే దేశంలో వస్తువుల విక్రయాలు 13.7 శాతం తగ్గాయి. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కనిపించడం లేదు.
Read Also:Viral Video: ఫ్లైట్ ఆసల్యమైందని సిబ్బంది కొట్టిన ప్రయాణికుడు..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!